కన్నప్ప.. విష్ణులో ఈ టాలెంట్ కూడా ఉందా?
అదే సమయంలో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మంచు విష్ణు సర్ప్రైజింగ్ వీడియోను షేర్ చేశారు.
By: Tupaki Desk | 8 May 2025 8:30 AMటాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ లో మైథాలాజికల్ ఫిల్మ్ గా రూపొందిన మూవీ కోసం భారీ క్యాస్టింగ్ రంగంలో దింపడం విశేషం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, మధుబాల, శరత్ కుమార్ సహా పలువురు కన్నప్పలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, మేకర్స్ వాయిదా వేశారు. ఇప్పుడు జూన్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా మూవీని రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
అదే సమయంలో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మంచు విష్ణు సర్ప్రైజింగ్ వీడియోను షేర్ చేశారు. ఎవరికీ తెలియని విషయాన్ని రివీల్ చేశారు. సినిమా కోసం చాలా కష్టపడ్డ విష్ణు.. ఇప్పుడు సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ కు స్టంట్ కొరియోగ్రఫీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
''ఇది ఎక్కువ మందికి తెలియదు. నేను యాక్టర్ గా మారడానికి ముందు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. లాస్ ఏంజిల్స్ లో స్టంట్ మ్యాన్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత భారత్ కు వచ్చి నా ప్యాషన్ ను ముందుకు తీసుకెళ్లాను. తెలుగు స్టంట్ యూనియన్ లో సభ్యుడిగా ఉన్నానని గర్వంగా చెబుతున్నా" అని పోస్ట్ పెట్టారు.
"సినిమాల్లోకి వచ్చిన స్టార్టింగ్ నుంచి ఫైట్ సీన్స్ కు కొరియోగ్రఫీ చేస్తున్నాను. ఇప్పుడు కన్నప్పకు గాను కొన్ని యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేసే ఛాన్స్ వచ్చింది. అందుకు స్టంట్ కొరియోగ్రాఫర్ కెచాకు థ్యాంక్స్. ఇంటెన్స్, హై-ఆక్టేన్ మూమెంట్స్ లో కొన్నింటిని ఎలా డిజైన్ చేశానో వీడియో రూపంలో తెస్తున్నా" అంటూ రాసుకొచ్చారు. వీడియో కూడా షేర్ చేశారు.
అయితే వీడియోలో విష్ణు.. స్టంట్ సీన్స్ ను షూట్ చేసిన విజువల్స్ ఉన్నాయి. షూటింగ్ లొకేషన్ లో ఫైట్స్ చూసి చూపించి అలరించారు విష్ణు. కెచా పర్యవేక్షణలో క్యాస్టింగ్ ను సిద్ధం చేస్తూ కనిపించారు. దీంతో కన్నప్ప కోసం విష్ణు ఎంతో కష్టపడ్డారనేది వీడియో ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే విష్ణులో ఈ టాలెంట్ కూడా ఉందని అంతా షాకవుతున్నారు. మరి మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.