Begin typing your search above and press return to search.

కన్నప్ప.. విష్ణు US టూర్ సూపర్ సక్సెస్!

సినిమాను గ్లోబల్ వైడ్ గా ప్రమోట్ చేయాలన్న టార్గెట్ తో విష్ణు.. అమెరికా టూర్ ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 May 2025 6:15 AM
Vishnu Manchu’s Kannappa U.S. Tour
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. భారీ మైథలాజికల్ పాన్ ఇండియా మూవీగా రానున్న కన్నప్ప.. విష్ణు కెరీర్ లోనే అతిపెద్ద ప్రాజెక్టు. అందుకే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన.. అన్నీ తానై ముందుకు వెళ్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.


సినిమాను గ్లోబల్ వైడ్ గా ప్రమోట్ చేయాలన్న టార్గెట్ తో విష్ణు.. అమెరికా టూర్ ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూఎస్ టూర్ ను విష్ణు విజయవంతంగా ముగించారు. బుధవారం ఉదయం న్యూయార్క్‌ లో అడుగుపెట్టిన ఆయన.. ఆ తర్వాత న్యూజెర్సీ, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కోలను కవర్ చేస్తూ సందడి చేశారు.

కేవలం నాలుగు రోజుల వ్యవధిలో యూఎస్ టూర్ ను పూర్తి చేసిన విష్ణు.. ఇప్పుడు అందులో సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రతీ సిటీలో ఫ్యాన్స్, మూవీ లవర్స్ కు స్పెషల్ ట్రీట్స్ ఇచ్చారు. ప్రత్యేక ప్రదర్శనలను తిలకించేలా ప్లాన్ చేసుకున్నారు. ఏడు నిమిషాల వీడియో చూసి ఓవర్సీస్ జనాలు షాక్ అయ్యారని టాక్.

ప్రమోషన్స్ మెటీరియల్, ఉత్కంఠభరితమైన విజువల్స్, మేకింగ్స్ విజువల్స్ తో కూడిన గ్లింప్స్ ను ప్రదర్శించారు మేకర్స్. ప్రతీ వేదిక కూడా చప్పట్లతో హోరెత్తిందని తెలుస్తోంది. భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మక భక్తి చిత్రాల్లో ఒకటైన కన్నప్ప స్థాయి, కథ వివరణ, గొప్పతనాన్ని చూసి ప్రేక్షకులు అంతా మంత్ర ముగ్ధులయ్యారు!

అదే సమయంలో విష్ణు కూడా తన ప్రమోషనల్ టాలెంట్ తో ఆకట్టుకున్నారట. ప్రతి వేదికలోనూ ఆయన స్వయంగా అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. క్వశ్చన్, ఆన్సర్ సెషన్లలో అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఓవర్సీస్ లో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలతో హృదయపూర్వక సంభాషణలకు సమయం కేటాయించారు.

దీంతో ఆయనపై అంతా ప్రశంసలు కురిపించారు. మూవీ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా విష్ణు అమెరికాలోని ప్రముఖ తెలుగు మీడియా సంస్థలతో నిమగ్నమై కన్పప్పను వేరే లెవెల్ లో ప్రమోట్ చేశారు. కన్నప్ప కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఇది ఒక అనుభవమని చెబుతున్నారు. మరి జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న మూవీతో ఆయన ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.