హీరో కాకపోతే విష్ణు ఐపీఎస్ అయ్యేవాడు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వాన్నిపుణికి పుచ్చుకుని విష్ణు హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jun 2025 1:03 PM ISTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వాన్నిపుణికి పుచ్చుకుని విష్ణు హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోగా ఎన్నో సినిమాలు చేసాడు. 'కన్నప్ప' తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతు న్నాడు. 'కన్నప్ప' ను ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి కర్త, కర్మ , క్రియ అయ్యాడు. మరి ఈ సినిమా అతడికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. ఆ సంగతి పక్కన బెడితే విష్ణుకు అసలు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పుడూ లేదుట.
చిన్నప్పుడు ఓ సినిమా చేసినా ఈ రంగంలో స్థిరపడాలనుకోలేదుట. ఎందుకంటే డాడ్ అతడిని ఐపీఎస్ చేయాలనుకున్నారుట. ప్రభుత్వ అధికారిగా చూడాలన్నది మోహన్ బాబు కోరిక అట. అందుకే ఇంజనీరింగ్ లో చేరినట్లు తెలిపాడు. అయితే ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ లో మోహన్ బాబు...విష్ణు వద్దకు వచ్చి ఐపీఎస్ కంటే నీకు సినిమాలే బాగుంటాయన్నారు. అప్పటి నుంచి సినిమాల మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టి నట్లు తెలిపాడు.
నటుడిగా అవసరమైన ట్రాన్సపర్మేషన్ అంతా అప్పటి నుంచే ప్రారంభమైందన్నాడు. లేదంటే మంచు విష్ణును అందరూ ఐపీఎస్ గా చూసేవారు. విష్ణు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తాడట. తన పను లన్నా తానే స్వయంగా చేసుకుంటాడుట. ఇతరుల కోసం వెయిట్ చేయనన్నాడు. పనులన్ని రాత్రి పదిలోపు ముగించుకుని నిద్రపోతాడుట. డే అంతా ఎంత బిజీగా ఉన్నా జిమ్ మాత్రం స్కిప్ కొట్టన్నాడు.
క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడుతాడుట. క్యాంపస్ లో బాస్కెట్ బాల్ కెప్టెన్ కూడా. ఆటలపై ఆసక్తితో మార్షల్ ఆర్స్ట్ లోనూ ట్రైనింగ్ తీసుకున్నాడుట. లాస్ ఏంజెల్స్ లో స్టంట్ మ్యాన్ గానూ పనిచేసాడుట. ఆ అనుభవంతోనే `కన్నప్ప`లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తానే స్వయంగా డిజైన్ చేసాడుట.
