కన్నప్పకు బిగ్ శాటిలైట్ డీల్.. విష్ణు రిస్క్‌కి రివార్డ్
తాజాగా ‘కన్నప్ప’కి భారీ స్థాయిలో హిందీ శాటిలైట్ హక్కులు అమ్ముడవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
By: Tupaki Desk | 1 July 2025 3:45 PM ISTమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన ‘కన్నప్ప’ మొత్తానికి మంచి ఫలితం ఇచ్చినట్లు మేకర్స్ కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు. భక్తికథలోను, విజువల్ ఫెయిర్‌గా కూడా ఓ గ్రాండ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసిన విష్ణు, ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ సినిమాలో అతను హీరోగా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. అంతేగాక, ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సొంతంగా తన ఆస్తులను తాకట్టు పెట్టడం ద్వారా ఎంతో రిస్క్ తీసుకున్నారు.
ఈ మూవీ విడుదలకు ముందే కొన్ని డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్, ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయితే, వాటిని విష్ణు రిజెక్ట్ చేశాడు. మంచి కంటెంట్ ఉంటే… మార్కెట్‌ను తాను సృష్టించగలనన్న ధైర్యంతో ముందుకెళ్లారు. రిలీజ్ టైమ్‌లోనూ ఇలాంటి సీజన్ లో ఆడిస్తే, కలెక్షన్లు తక్కువ వస్తాయన్న వాదనల్ని లెక్కచేయకుండా విడుదల చేశారు. నిజంగా సినిమా మీద ఆత్మవిశ్వాసం ఉన్నంత మాత్రానెవ్వరూ ఇలా తేడా లేకుండా పెద్ద రిస్క్ తీసుకోరు. కానీ విష్ణు చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలిస్తోంది.
తాజాగా ‘కన్నప్ప’కి భారీ స్థాయిలో హిందీ శాటిలైట్ హక్కులు అమ్ముడవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రముఖ లీడింగ్ ఏజెన్సీ ఈ హక్కులను రూ.20 కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇది మంచు విష్ణు కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డేవోషనల్ సినిమాల ట్రాక్‌లోనూ ఓ పెద్ద డీల్. ఇప్పటి వరకు ఓ డివోషనల్ ఫిల్మ్‌కు ఉత్తర భారతంలో ఇంత డిమాండ్ రావడం చాలా అరుదు. ఈ డీల్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ‘కన్నప్ప’ క్రేజ్‌కి ఎంత స్థాయిలో బజ్ పెరిగిందో తెలుస్తోంది.
ఇంకా ఇది మాత్రమే కాదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఓటీటీ హక్కులకు సంబంధించి పెద్ద OTT సంస్థలు బిడ్డింగ్ ప్రారంభించాయని సమాచారం. థియేటర్లలో సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ దృష్టిలో పెట్టుకుని బిజినెస్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఓటీటీ, డిజిటల్ స్ట్రీమింగ్, డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. డీల్ క్లోజ్ అయిన వెంటనే వాటి వివరాలు వచ్చే అవకాశముంది.
ఇక థియేట్రికల్ రన్ కూడా ప్రస్తుతం బాగా నడుస్తోంది. ఫ్యామిలీస్, యూత్ నుంచి ఓ మినిమం గుడ్ టాక్ వస్తుండటంతో కలెక్షన్ల పరంగా వారం వారం బాగా పెరుగుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వంటి స్టార్లు చేసిన కేమియోస్ వల్ల నార్త్ ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. పైగా భక్తిరస, యాక్షన్, విజువల్స్ మిక్స్ కావడంతో రీజినల్ బౌండరీస్ దాటి ఈ సినిమా దూసుకెళ్తోంది. ఇక ‘కన్నప్ప’ విజయాన్ని బేస్‌గా పెట్టుకుని విష్ణు పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని భారీ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.
