ఐకానిక్ ప్రమోషన్లతో కన్నప్ప యూఎస్ టూర్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ మైథలాజికల్ మూవీ ‘కన్నప్ప’కు హై రేంజ్ క్రేజ్ ఏర్పడుతోంది.
By: Tupaki Desk | 7 May 2025 11:45 AMమంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ మైథలాజికల్ మూవీ ‘కన్నప్ప’కు హై రేంజ్ క్రేజ్ ఏర్పడుతోంది. ఇప్పటివరకు మంచు విష్ణు కెరీర్‌లో ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్లేందుకు విష్ణు గ్లోబల్ ప్రమోషన్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఇక ఓవర్సీస్ అభిమానులను కలవడానికి, సినిమా గురించి ప్రత్యేకంగా ప్రేమోట్ చేయడానికి ఇటీవల యూఎస్ కు బయలు దేరారు విష్ణు. అందుకు సంబంధించిన ఫొటో కూడా హైలెట్ అవుతోంది.
అమెరికా టూర్‌లో భాగంగా మొదటి స్టేజ్‌లో మే 8న న్యూజెర్సీలో రేగల్ కామర్స్ సెంటర్‌లో అభిమానులను కలుస్తారు. అనంతరం మే 9న డల్లాస్‌లో గెలాక్సీ థియేటర్స్, మే 10న బే ఏరియాలో సిని లౌంజ్ ఫ్రెమాంట్ 7 సినిమాస్‌లో అభిమానులను ఆకట్టుకుంటారు. యూఎస్‌లో ఈ స్థాయిలో తెలుగు మైథలాజికల్ సినిమాకు జరుగుతున్న మొదటి ప్రమోషన్ టూర్ అని చెప్పవచ్చు.
అంతర్జాతీయంగా ‘వసారా’ సంస్థ ఈ సినిమాకు విడుదల బాధ్యతలు చేపట్టింది. ఓవర్సీస్ ప్రమోషన్స్ అనంతరం తర్వాత భారత్‌లో మరిన్ని ప్రమోషన్లు చేయనున్నారు. పలు యాత్రలు, సిటీ టూర్లు మొదలు పెట్టబోతున్నట్టు యూనిట్ చెబుతోంది. ‘కన్నప్ప’ ఇప్పటికే సాంగ్‌లతో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా ‘శివ శివ శంకరా’ అనే భక్తిరస గీతం ప్రేక్షకులను డేవోషనల్ గా ఆకట్టుకుంటోంది.
అలాగే లవ్ సాంగ్ కూడా యువతను ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ విజయాల తర్వాత ఇప్పుడు అందరి చూపు ట్రైలర్‌పైనే ఉంది. ట్రైలర్‌ను జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్ చేసి, ప్రేక్షకుల్లోని నమ్మకాన్ని మరో స్థాయికి చేర్చనున్నారు. ఈ సినిమాకు ఇలాంటి ప్రచార వ్యూహాలు బాగానే ప్లస్ అవుతున్నాయి. ఇక విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు.
మోషన్ పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లు అని తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ, ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించే స్థాయిలో ఉందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. ఇక విడుదల అనంతరం కన్నప్ప ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.