Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ గారి రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నా: మంచు విష్ణు

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jun 2025 8:30 AM
పవన్ కళ్యాణ్ గారి రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నా: మంచు విష్ణు
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో విష్ణు లీడ్ రోల్ పోషించారు. మోహన్ బాబు, శరత్‌ కుమార్‌, మధుబాల, ముకేశ్‌ రుషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుందన్‌, ఐశ్వర్య భాస్కరన్‌, సప్తగిరి, శివ బాలాజీ తదితరులు నటించారు.

వారితోపాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాలీవుడ్ హీరో మోహన్‌ లాల్‌, బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌, టాలీవుడ్ చందమామ కాజల్‌ అగర్వాల్‌ క్యామియో రోల్స్ లో యాక్ట్ చేశారు. స్టీఫెన్‌ దేవస్సే మ్యూజిక్ అందించగా, కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను విష్ణు తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు గ్రాండ్ గా తనదైన రీతిలో సినిమాను రూపొందించారు.

అయితే ఇప్పుడు కన్నప్ప మూవీ కోసం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సినిమా చూసిన అనేక మంది సినీ ప్రియులు, నెటిజన్లు నెట్టింట రివ్యూస్ చేస్తున్నారు. ప్రజెంట్ జెనరేషన్ ను ఆక‌ట్టుకునేలా బ‌ల‌మైన సాంకేతిక హంగులతో మేకర్స్ సినిమా తీశారని చెబుతున్నారు. క‌న్న‌ప్ప భ‌క్తి సారాన్ని ప‌క్కాగా తెర‌పైకి తీసుకురావ‌డంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని అంటున్నారు.

క్లైమాక్స్ సూపర్ అని, వేరే లెవెల్ అని కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో కొందరు సెలబ్రిటీలు కూడా కన్నప్ప మూవీ గురించి మాట్లాడుతున్నారు. మోహన్ బాబు రెండో కుమారుడు, హీరో మనోజ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవ్వనున్న రివ్యూ కోసం తాను వెయిట్ చేస్తున్నట్లు రీసెంట్ గా మంచు విష్ణు తెలిపారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌ కు సినిమా ఎప్పుడు చూపిస్తారని హోస్ట్ అడగ్గా.. మూవీ రిలీజ్ అయిన వెంటనే ఆయన సమయం తీసుకుని వ్యక్తిగతంగా కలిసి కన్నప్ప చిత్రాన్ని చూపిస్తానని తెలిపారు. ప్రత్యేక షోలో చూపిస్తానని చెప్పారు. తమకు తెలిసిన పవన్‌ వేరని అన్నారు.

ఆయనపై రాష్ట్రం మొత్తం బాధ్యత ఉందని తెలిపారు.

అయితే తప్పకుండా ఆయన సమయం తీసుకుని సినిమా చూపించాలని విష్ణు చెప్పారు. ఇండస్ట్రీలో నటుడిగా ఆయన తనకు సీనియర్‌ అని చెప్పారు. ఆయన నుంచి ప్రశంసలు వస్తాయో.. రావోనని అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. సినిమాపై పవన్ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం విష్ణు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కు కూడా సినిమా నచ్చుతుందని అనేక మంది నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని ఉందని అంటున్నారు. మరి కన్నప్ప మూవీని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూస్తారో..