కన్నప్ప హార్డ్ డిస్క్ ఏమైంది.. విష్ణు ఏమన్నాడంటే..?
మంచు విష్ణు లీడ్ రోల్ లో భక్త కన్నప్ప కథతో తెరకెక్కిన సినిమా కన్నప్ప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం విష్ణు భారీ బడ్జెట్ ని కేటాయించాడు.
By: Tupaki Desk | 6 Jun 2025 4:24 PMమంచు విష్ణు లీడ్ రోల్ లో భక్త కన్నప్ప కథతో తెరకెక్కిన సినిమా కన్నప్ప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం విష్ణు భారీ బడ్జెట్ ని కేటాయించాడు. సినిమాలో విష్ణు తో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కూడా భాగమయ్యారు. జూన్ 27న కన్నప్ప రిలీజ్ కాబోతుంది. ఐతే ఈ టైంలో కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్ అంటూ ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సినిమాకు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కి చెందిన హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది.
ఐతే ఈ హార్డ్ ఇష్యూలో మంచు విష్ణు తన సోదరుడు మనోజ్ హస్తం ఉందని చెబుతున్నాడు. కన్నప్ప హార్డ్ డిస్క్ విషయంలో ఈమధ్య రెండు మూడు సందర్భాల్లో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఐతే హార్డ్ డిస్క్ దొరికిందా లేదా అన్న దానికి మాత్రం మనోజ్ నుంచి ఆన్సర్ రాలేదు. తనకు ఇష్యూ సంబంధం లేదన్నట్టుగానే ఆన్సర్ ఇచ్చాడు. ఐతే లేటెస్ట్ గా కన్న ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో మంచు విష్ణు కన్నప్ప హార్డ్ డిస్క్ మా ఫిల్మ్ నగర్ ఇంటి అడ్రస్ కి వచ్చింది. అక్కడ మనోజ్ గారి ఆఫీస్ లో పనిచేసే వాళ్లు తీసుకున్నారు. ఆ తర్వాత అది మనోజ్ ఇంటికి వెళ్లిందని చెప్పాడు.
ఇదంతా తాను ఊరకనే చెప్పట్లేదని పోలీసులు ఆల్రెడీ ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశారని చెప్పుకొచ్చాడు. ఒకవేళ తాను చెప్పింది ఫాల్స్ అయితే తన మీద యాక్షన్ వస్తారంటూ చెప్పాడు. హార్డ్ ఇష్యూ కంప్లైంట్ ఇచ్చిన ఐదు రోజుల తర్వాత మీడియాకు తెలిసిందని అన్నాడు మంచు విష్ణు. పోలీసుల చేతుల్లో కేసు ఉందని వాళ్ల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నాడు మంచు విష్ణు.
ఐతే విష్ణు లేటెస్ట్ కామెంట్స్ చూస్తుంటే కన్నప్ప హార్డ్ డిస్క్ మంచు మనోజ్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ల పర్సనల్ ఫైట్స్ ని సినిమాల మీద చూపించడం సినీ ప్రియులను కూడా షాక్ అయ్యేలా చేస్తుంది. ఐతే మంచు విష్ణు మాత్రం హార్డ్ డిస్క్ మిస్సైంది అన్న టెన్షన్ ఏమి లేకుండా సినిమా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకులను మరింత చేరువయ్యేలా చేస్తున్నాడు.