Begin typing your search above and press return to search.

నా జీవితంలో కృష్ణుడు ప్రభాస్ : మంచు విష్ణు

మంచు విష్ణు కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జె.ఆర్.సీ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 1:53 AM IST
నా జీవితంలో కృష్ణుడు ప్రభాస్ : మంచు విష్ణు
X

మంచు విష్ణు కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జె.ఆర్.సీ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ లో నటుడు నిర్మాత మంచు విష్ణు స్పీచ్ ఆడియన్స్ ని అలరించింది. కనప్ప కథ 2014 లో తన దగ్గరకు వచ్చిందని.. ఆ తర్వాత రైట్స్ తీసుకున్నానని అన్నారు.

ఇక ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఒక్కో నటుడు ఉండాలని రాసుకున్నా.. మానిఫెస్ట్ చేస్తే జరుగుతుంది అంటారు కదా శివానుగ్రహం ఉండటం వల్ల అలా కుదిరిందని అన్నారు. కన్నప్ప విష్ణు సినిమా కాదు.. ఇది కన్నప్ప సినిమా.. సినిమా చూసినప్పుడు ఇంత పెద్ద సినిమా తీశామా.. ఇందులో నేను నటించానా అనిపించింది.. శివయ్య ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు మంచు విష్ణు.

ఈ సినిమాకు స్టీఫెన్ దేవసీ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. 2017లో స్టీఫెన్ ఒక ఈవెంట్ చూశాను. కన్నప్ప సినిమా ఎప్పుడు మొదలైనా మీరే చేయాలని చెప్పానని అన్నారు. సినిమాలో నటించిన మోహన్ లా గారు.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. అక్షయ్ కుమార్ గారికి థాంక్స్ అని అన్నారు. ఇక శరత్ కుమార్ గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయనతో ఎన్నో ఏళ్లుగా సినిమా చేయాలని అనుకున్నా కన్నప్పతో అది కుదిరింది. తమిళ్ లో కన్నప్ప రిలీజ్ కు ఆయన హెల్ప్ చేశారని అన్నారు మంచు విష్ణు.

సినిమాలో బ్రహ్మానందం గారు నటించారు. షూట్ స్టార్ట్ చేయకముందే సినిమా హిట్ అవ్వాలని చెప్పారు. ఆయనకు థాంక్స్. ఈ సినిమాలో చాలామంది హీరోలు ఉన్నారు. డైరెక్టర్ ఒక హీరో.. ఆయన చాలా సైలెంట్.. ఇన్నేళ్ల నా కెరీర్ లో ఆయనే బెస్ట్ డైరెక్టర్ అని అన్నారు విష్ణు.

ఈ సినిమా అనుకున్నంత సులభంగా కాలేదు. శివుడి ఆజ్ఞతోనే ఈ తరానికి శివుడి కథ చెప్పాలని తనని ఎంచుకున్నాడని కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కి తాను చెప్పానని అన్నారు మంచు విష్ణు. సినిమా ఆరు రోజుల్లో రిలీజ్ ఉన్నా పరీక్ష పెడుతున్నాడు.

ఇక స్పీచ్ లో భాగంగా స్నేహితులు రెండు రకాలు.. కృష్ణుడిలా కొందరు.. కర్ణుడిలా కొందరు ఉంటారు. నీ పక్కనే ఉంటూ నీకు దారి చూపిస్తాడు కృష్నుడు.. నా జీవితంలో కృష్ణుడు ప్రభాస్ అని అన్నారు మంచు విష్ణు. కర్ణుడిగా నీ వెనక ఎప్పటికీ ఉంటా ప్రభాస్ అన్నారు విష్ణు. కొంత పేరొచ్చినా మనుషులు మారిపోతారు.. ప్రపంచంలోనే బిగ్ స్టార్.. అయినా మేమిద్దరం మొదటిరోజు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం ప్రభాస్ ఇది నువ్వు చూస్తున్నవ్.. నా జీవితంలో కృష్ణుడు నువ్వు.. నీ జీవితంలో నేను కర్ణుడిని అన్నారు మంచు విష్ణు.

ఇక ఫైనల్ గా ఈ సినిమా సాధ్యమైంది అంటే నా దేవుడు మా నాన్న వళ్లే.. ఆయన తర్వాతే నాకు దేవుడు.. సినిమాకు పనిచేసిన అందరికీ రుణపడి ఉంటా.. మీ ఆశీస్సులతో సినిమా విజయం సాధించాలని కోరారు మంచు విష్ణు.