మంచువారి అమ్మాయిలతో కన్నప్ప స్పెషల్ సాంగ్
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘శ్రీకాళహస్తి’ లిరికల్ వీడియోను మే 28న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
By: Tupaki Desk | 24 May 2025 5:42 PM ISTభక్తికెంతో ప్రాధాన్యత ఇచ్చే కథనాన్ని ఆధారంగా చేసుకుని, భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. శ్రీశైలానికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన త్యాగాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. క్షత్రియుడిగా జన్మించి, మహాదేవునికి అత్యంత భక్తుడిగా మారిన కన్నప్ప జీవితగాథగా ఇది నిలవబోతోంది. గాథతో పాటు విజువల్స్ పరంగా కూడా ఈ సినిమా హై రిచ్ వాల్యూస్‌తో రూపొందుతోంది.
ఈ పాన్ ఇండియా చిత్రంలో విష్ణు మంచు టైటిల్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీనికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం ఇందులో భాగంగా ఉండటం సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, స్టీఫెన్ దేవసీ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘శ్రీకాళహస్తి’ లిరికల్ వీడియోను మే 28న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పాటను ఎవరు పాడుతున్నారనేది హైలైట్. విష్ణు మంచు కుమార్తెలు అరియానా మంచు, వివియానా మంచు తమ గాత్రంతో ఈ పాటను పాడారు.
వారిద్దరు ఇదివరకే జిన్నా మూవీలో కూడా ఒక పాట పాడారు. గాత్రంలో వినిపించబోయే శ్రీకాళహస్తి త్యాగగాథ ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. శివునిపై భక్తితో కూడిన ఈ గీతం ప్రేక్షకుల్లో ఆధ్యాత్మికతను రగిలించేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌లో అరియానా, వివియానా ఇద్దరూ ప్రాచీన వేషధారణలో పూల తోటలో పరిగెత్తుతూ కనిపించారు.
ఈ చిత్రంలో వారి పాత్రలేవైనా ఉన్నాయా? లేక స్పెషల్ సాంగ్ తోనే ఉంటుందా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సాంగ్ ఫ్యామిలీ ఎమోషన్, మ్యూజిక్, డెవోషన్‌ని కలగలిపే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇదివరకే ప్రొమోలకు వచ్చిన స్పందన దృష్ట్యా ఈ పాట కూడా భారీగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులోని ప్రతీ భాగాన్ని ఓ భక్తి యాత్రలా తీర్చిదిద్దాలని టీమ్ భావిస్తోంది. మరి ఈ కథ ఎంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
