ఆ స్టార్ హీరోను డైరెక్ట్ చేయాలనుంది
మోహన్ బాబు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు గత కొన్ని సినిమాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు.
By: Tupaki Desk | 25 Jun 2025 7:44 AMమోహన్ బాబు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు గత కొన్ని సినిమాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి విష్ణు రెడీ అయ్యారు. జూన్ 27న కన్నప్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా చిత్ర ప్రమోషన్స్ లో విష్ణు చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు కన్నప్ప సినిమాతో పాటూ పలు విషయాల గురించి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా విష్ణు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఫ్యూచర్ లో డైరెక్షన్ వైపు వెళ్తారా అని అడగ్గా, ఆ ప్రశ్నకు విష్ణు స్పందించి సమాధానమిచ్చారు. ఒకవేళ తాను డైరెక్టర్ అయితే బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేయాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
అమితాబ్ ను డైరెక్ట్ చేయడం తన చిరకాల కోరిక అని, భారత దేశం మొత్తం ఆయన యాక్టింగ్ ను ఎంతగానో ఇష్టపడుతుందని, గతేడాది రిలీజైన కల్కి సినిమాలో అశ్వత్థామ క్యారెక్టర్ లో అతని నటన ఎంతో అద్భుతంగా ఉందని, ఆ క్యారెక్టర్ తనకెంతో నచ్చిందని మనసులోని మాటను బయటపెట్టారు విష్ణు. ప్రస్తుతం విష్ణు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక కన్నప్ప విషయానికొస్తే ఈ సినిమా సక్సెస్ పై విష్ణు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విష్ణు తిన్నడు పాత్రలో నటిస్తున్నారు. మోహన్ బాబు నటిస్తూ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ క్యాస్టింగ్ తో వస్తోన్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి.