హీరోగా సాధించలేనిది విలన్ గా!
మంచు మనోజ్ కొన్నాళ్ల పాటు హీరోగా కొనసాగిన సంగతి తెలిసిందే. చాలా కాలంపాటు హీరోగానే పని చేసాడు.
By: Tupaki Desk | 14 Jun 2025 3:00 AM ISTమంచు మనోజ్ కొన్నాళ్ల పాటు హీరోగా కొనసాగిన సంగతి తెలిసిందే. చాలా కాలంపాటు హీరోగానే పని చేసాడు. అటు మనోజ్ జీవితం కొత్త టర్నింగ్ తీసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురు దెబ్బలతో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో రెండవ వివాహం చేసుకోవడం అటుపై కుటుంబంలో వివాదాలు ఇలా కొన్నింటితో మనోజ్ ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం సమస్యలన్ని ఒక్కొక్కటిగా పరిష్కార మవుతున్నాయి.
ఇదే సమయంలో నటుడిగా కూడా కొత్త టర్నింగ్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. `మిరాయ్` సినిమాతో విలన్ గా పరిచయమవుతున్నాడు. ఇంతకాలం హీరోగా చూసిన మనోజ్ ని ఈ సినిమాలో విలన్ గా చూస్తు న్నాం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మనోజ్ లుక్...గెటప్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విలన్ గా బాగా సెట్ అయ్యాడనే పాజిటివ్ ఇంప్రెషన్ ప్రచార చిత్రాలతోనే పడింది.
ఈ సినిమా సక్సెస్ అయితే గనుక మనోజ్ కు విలన్ గా మంచి కెరీర్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తు న్నారు. మనోజ్ హీరోగా నటించడం కంటే పుల్ టైమ్ విలన్ గా మారితే చాలా చిత్రాల్లో అవకాశాలు వస్తాయి. స్టార్ హీరోల చిత్రాలకు విలన్ పాత్రలు ఇప్పుడు కీలకం. విలన్ పాత్రలంటే కొంత కాలం పాటు బాలీవుడ్ వైపు చూసిన మేకర్స్ ఇప్పుడు మాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఆ భాషలో విషయం ఉన్న నటుల్ని వెతికి పట్టు కుంటున్నారు.
శ్రీకాంత్, జగపతి బాబు లాంటి నటులున్నా? పాత్రల పరంగా విలన్ కు అన్ని రకాలుగా సూటవ్వడం లేదు. జగపతి బాబు మెరుగ్గా ఉన్నా? శ్రీకాంత్ తేలిపోతున్నాడు. వాళ్లిద్దరిలో లేని యూనిక్ ట్యాలెంట్ మనోజ్ తనలో ఉందని ప్రూవ్ చేయగల్గితే మంచి అవకాశాలు అందుకోగలడు. మాస్ విలనిజానికి మనోజ్ అన్ని రకాలుగా సెట్ అవుతాడు.
