డైరెక్టర్ విజయ్ పై ట్రోలింగ్.. సారీ చెప్పిన మంచు మనోజ్..
ఇప్పుడు ఆ విషయంపై మంచు మనోజ్ కూడా రెస్పాండ్ అయ్యారు. రీసెంట్ గా భైరవం మూవీ మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆయన, విజయ్ పై ట్రోల్స్ విషయంపై మాట్లాడారు.
By: Tupaki Desk | 26 May 2025 7:37 AMడైరెక్టర్ విజయ్ కనకమేడలపై ఇటీవల ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆయన ఫేస్ బుక్ అకౌంట్ లోని ఓ పోస్ట్ పై కొద్ది రోజుల క్రితం ట్రోల్స్ ఎదుర్కొన్నారు. మెగా అభిమానులు విజయ్ పై మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే ఆయన రెస్పాండ్ అయ్యారు. వారికి క్షమాపణలు చెప్పారు. అప్పుడు తన అకౌంట్ హ్యాక్ అయ్యి ఉంటుందని తెలిపారు.
ఇప్పుడు ఆ విషయంపై మంచు మనోజ్ కూడా రెస్పాండ్ అయ్యారు. రీసెంట్ గా భైరవం మూవీ మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆయన, విజయ్ పై ట్రోల్స్ విషయంపై మాట్లాడారు. ఇటీవల భైరవం మూవీ విషయంలో బాయ్ కాట్ ట్రెండ్ నడిచిందని, విజయ్ పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తిగా కొనియాడారు మంచు మనోజ్.
ఆయన ఎప్పుడూ పదిమందికి సేవ చేస్తూ ఉంటారని తెలిపారు. విజయ్ ఏదో ఒక పోస్ట్ పెట్టారని అంటున్నారని, అది నిజమో కాదో తెలియదని అన్నారు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు విజయ్ వీరాభిమానని అని తెలిపారు. అందరూ ఒక్కటై మనల్ని ఒంటరిని చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.
అందుకే వేరే ఎవరైనా అంటే విజయ్ పట్టించుకునేవారు కాదని తెలిపారు. కానీ, తన ఫ్యామిలీ లాంటి మెగా అభిమానులు ట్రోల్స్ చేస్తుంటే.. ఆయనను అలా చూడలేకపోతున్నట్లు తెలిపారు. మెగా ఫ్యాన్స్ అంతా భైరవం మూవీకి సపోర్ట్ చేయాలని కోరారు. ఒకవేళ పోస్టు విషయంలో ఇబ్బంది ఫీల్ అయితే క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్.
భైరవం టీమ్ తరఫున కూడా మెగా అభిమానులందరికీ క్షమాపణలు చెప్పారు. ఏదైనా సినిమా మాత్రం ఒక్కరి వల్ల సాధ్యం కాదని అన్నారు. ఎంతోమంది కష్టంతో కూడుకున్నదే సినిమా అని చెప్పారు. తాను తొమ్మిదేళ్ల ఏళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరారు. తన వెన్నంటే ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు కూడా చెప్పారు.
అదే సమయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా మాట్లాడారు. దర్శకుడు విజయ్ తన వంతు కృషి చేశారని, ఆయన అంకితభావం మూవీ అంతటా కనిపిస్తుందని చెప్పారు. భైరవం మామూలు మూవీ కాదని, మనసును కదిలించేలా ఫైనల్ కట్ ఉందని చెప్పారు. మే 30వ తేదీన జరగనున్న పండుగలో అందరూ భాగం అవుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరి భైరవం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.