అర్జున్ రెడ్డి నేనే చేయాల్సిన మూవీ: మంచు మనోజ్
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో 'మీ వరకు వచ్చిన సినిమాల్లో రిజెక్ట్ చేశాక అవి హిట్ అయిన సినిమాలు ఉన్నాయా?' అని యాంకర్ అడగ్గా.. మంచు మనోజ్ స్పందించారు.
By: Tupaki Desk | 29 May 2025 11:00 PM ISTటాలీవుడ్ హీరో మంచు మనోజ్.. లాంగ్ గ్యాప్ తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాలో నారా రోహిత్ తో పాటు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఆ చిత్రం.. మే 30న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
అయితే ఇప్పటికే మూవీపై మంచి అంచనాలు ఉండగా.. వాటిని మేకర్స్ పెంచుకుంటూ పోతున్నారు. రకరకాల ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. శ్రీనివాస్, రోహిత్, మనోజ్.. ముగ్గురూ తమ బాధ్యతగా ముందుండి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
అదే సమయంలో మనోజ్.. ఇంటర్వ్యూల్లో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అటు పర్సనల్ లైఫ్.. ఇటు సినీ కెరీర్.. రెండింటికి చెందిన పలు విషయాలు షేర్ చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సినీ ప్రియులను, నెటిజన్లను ఫుల్ గా ఆకర్షిస్తున్నాయి.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో 'మీ వరకు వచ్చిన సినిమాల్లో రిజెక్ట్ చేశాక అవి హిట్ అయిన సినిమాలు ఉన్నాయా?' అని యాంకర్ అడగ్గా.. మంచు మనోజ్ స్పందించారు. డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడం వల్ల అప్పుడు కొన్ని రిజెక్ట్ చేశానని తెలిపారు. రచ్చ మిస్ అయ్యానని, కానీ తన ఫ్రెండ్ రామ్ చరణ్ చేయడం వల్ల హ్యాపీగా ఉన్నానని చెప్పారు.
ఆ మూవీ పెద్ద హిట్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆటోనగర్ సూర్య సినిమా కూడా మిస్ చేసుకున్నానని, ఆ చిత్రం నాగచైతన్యకు వెళ్లిందని చెప్పారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ తన వద్దకే వచ్చిందని పేర్కొన్నారు. స్టార్టింగ్ లో తనను సంప్రదించారని, కానీ మిస్ అయ్యానని తెలిపారు. అందుకు పలుమార్లు రిగ్రెట్ ఫీలయ్యానని వెల్లడించారు.
ఆ డైరెక్టర్స్ తో వర్క్ చేసే మిస్ అయిందని బాధపడ్డానన్నారు. కానీ తాను ఎప్పుడూ ఒకటే నమ్ముతానని మనోజ్ తెలిపారు. ఒకటి పోతే మరొకటి వస్తుందని నమ్ముతానని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయ్యో.. మనోజ్ మంచి సినిమాలు మిస్ అయిపోయారని కామెంట్లు పెడుతున్నారు. అవి చేసుంటే కెరీర్ వేరేలా ఉండేదేమో అని అభిప్రాయపడుతున్నారు.
