మంచు హీరో 'అత్తరు సాయిబు'?
'90 ఎం.ఎల్' ఫేమ్ శేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి 'అత్తరు సాయిబు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.
By: Tupaki Desk | 8 May 2025 9:57 AMమంచు మనోజ్ ఒకానొక టైమ్ లో.ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా కొనసాగాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ కూడా సెట్ చేసుకున్నాడు. కానీ కమర్షియల్ సరైన బిగ్ హిట్ చూడలేదు. ఇక వరుస ఫ్లాప్స్ అనంతరం కొంత కాలం గ్యాప్ తీసుకున్న మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త సినిమాలతో సర్ ప్రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల 'భైరవం' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మనోజ్, 'మిరాయ్'లో విలన్‌గా కనిపించనున్నాడు. అయితే, గతంలో మొదలుపెట్టిన 'వాట్ ద ఫిష్', 'అహం బ్రహ్మస్మి' సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి, వాటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా రాలేదు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో మనోజ్ తన అభిమానులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.
మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 'భైరవం' సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేశాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు, ఇది ఒక మినీ మల్టీస్టారర్‌గా రూపొందింది. మనోజ్ మొదట తన అన్న విష్ణు మంచు నటించిన 'కన్నప్ప' సినిమాకు పోటీగా 'భైరవం'ను ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారని టాక్ గట్టిగానే వచ్చింది. 'కన్నప్ప' రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే 'భైరవం' టీమ్ కూడా అదే రోజున రిలీజ్ చేస్తే హాట్ టాపిక్ గా నిలిచే అవకాశం ఉంటుంది.
ఏదేమైనా, 'కన్నప్ప' జూన్ 27కి వాయిదా పడటంతో 'భైరవం' రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇప్పుడు మనోజ్ మరో కొత్త సినిమాతో సిద్ధమవుతున్నాడు. '90 ఎం.ఎల్' ఫేమ్ శేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి 'అత్తరు సాయిబు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ వినగానే ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కామెడీ సినిమా అని అర్థమవుతుంది. కొద్ది రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయి, ఇప్పుడు అవి ఓ కొలిక్కి వచ్చాయి.
ఈ సినిమాను ఈ నెల 20న లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందని టాక్. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 'అత్తరు సాయిబు' సినిమా మనోజ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్, కామెడీ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుందని, అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మరో హిట్‌ను అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా, మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 'భైరవం', 'మిరాయ్'తో పాటు 'అత్తరు సాయిబు'తో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమాలు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ను అందిస్తాయో చూడాలి.