Begin typing your search above and press return to search.

జ‌గ‌ప‌తిని ఫాలో అవుతున్న గ‌జ‌ప‌తి

ఇప్పుడు ఈయ‌న‌ని మంచు వార‌బ్బాయి మంచు మ‌నోజ్ ఫాలో అవుతున్న‌ట్టున్నాడు. 'ఒక్క‌డు మిగిలాడు' త‌రువాత దాదాపు తొమ్మిదేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన మంచు మ‌నోజ్ ఫైన‌ల్‌గా త‌న కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టారు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 1:17 PM IST
జ‌గ‌ప‌తిని ఫాలో అవుతున్న గ‌జ‌ప‌తి
X

హీరోగా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకున్న వారు ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా, విల‌న్‌లుగా రాణించ‌డం తెలిసిందే. ఇదే ఫార్ములాని ఫాలో అయిన జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు బిజీ యాక్ట‌ర్‌గా మారి వ‌రుస సినిమాల్లో విల‌న్‌గా, కీల‌క పాత్ర‌లలో న‌టిస్తూ వ‌స్తున్నారు. 'లెజెండ్‌' మూవీతో విల‌న్‌గా కొత్త ప్ర‌యాణం ప్రారంభించి టాలీవుడ్‌తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విల‌న్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు ఈయ‌న‌ని మంచు వార‌బ్బాయి మంచు మ‌నోజ్ ఫాలో అవుతున్న‌ట్టున్నాడు. 'ఒక్క‌డు మిగిలాడు' త‌రువాత దాదాపు తొమ్మిదేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన మంచు మ‌నోజ్ ఫైన‌ల్‌గా త‌న కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ఇందు కోసం బెల్లంకొండ సురేష్ న‌టించిన 'భైర‌వం'ని ఎంచుకున్నాడు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడు. నారా రోహిత్‌తో పాటు ఈ మూవీలో మంచు మ‌నోజ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఔరా అనిపించాడు.

ఇందులో విల‌న్‌ షేడ్స్ ఉన్న గ‌జ‌ప‌తి పాత్ర‌లో మంచు మ‌నోజ్ న‌టించిన ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా ఈ మూవీ విడుద‌లై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో అటెన్ష‌న్ ఏర్ప‌డ‌టానికి ఒక కార‌ణం తొమ్మిదేళ్ల విరామం తరువాత‌ మంచు మ‌నోజ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డ‌మే. గ‌జ‌ప‌తి వ‌ర్మగా డామినేట్ చేస్తూ మంచు మ‌నోజ్ క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ఫుల్ లెంగ్త్ రోల్‌లో మ‌నోజ్ న‌టించిన తీరు, డైలాగ్ డెలివ‌రీ, కొన్ని స‌న్నివేశాల్లో మోహ‌న్ బాబు బాయిస్‌ని అనుక‌రించి గాంభీర్యంగా మాట్లాడిన తీరు కూడా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

'భైర‌వం' సినిమా విజ‌యంలో మ‌నోజ్ పోషించిన గ‌జ‌ప‌తి వ‌ర్మ క్యారెక్ట‌ర్ కూడా ఓ కార‌ణంగా నిల‌వ‌డంతో మ‌నోజ్ కొత్త‌దారి ఎంచుకున్నాడ‌ని, ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌వ‌డం ఖాయ‌మ‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ త‌రువాత మ‌నోజ్ న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'మిరాయ్‌'. ఇందులో తేజ స‌జ్జ హీరోగా న‌టిస్తుండ‌గా, మంచు మ‌నోజ్ విల‌న్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నాడు. త‌న క్యారెక్ట‌ర్ ఇందులో ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని టీజ‌ర్‌తో క్లారిటీ వ‌చ్చేసింది. ఈ మూవీ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే మ‌నోజ్ కెరీర్‌కు ఇక తిరుగులేద‌న్న‌మాటే.