మిరాయ్ కు మంచు మనోజ్ ఎంత తీసుకున్నాడో తెలుసా
కాగా మనోజ్ రీసెంట్ గా భైరవంలో నటించారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 14 Sept 2025 7:55 PM ISTమంచు మనోజ్ మిరాయ్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో మహావీర్ లామా పాత్రలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందారు. ఆయన నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మిరాయ్ లో ఆయనది నెగెటివ్ క్యారెక్టర్ అయినా.. ఆ పాత్రకు వెయిటేజీ ఉంది. దీంతో ఇప్పుడు మనోజ్ మిరాయ్ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారన్న దానిపై చర్చ జరుగుతుంది.
మిరాయ్ లో హీరో పాత్రకు సమానమైన రోల్ లో మనోజ్ పాత్ర ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. మనోజ్ నటనకు దాదాపు రూ. 2.75 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒక నెగటివ్ పాత్రకు ఈ రేంజ్ పారితోషికం ఎక్కువనే చెప్పాలి. అయితే అధి మనోజ్ చేశారు కాబట్టే ఆ ఫిగర్ ఉంది. ఇది మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ఉన్న డిమాండ్ ను మరోసారి రుజువు చేసింది.
కాగా మనోజ్ రీసెంట్ గా భైరవంలో నటించారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన దాదాపు రూ. 2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెమ్యూనరేషన్ సంఖ్యలు మనోజ్ క్యాలిబర్, యాక్టింగ్ స్కిల్స్ ను తెలియజేస్తున్నాయి. అలాగే కమర్షియల్ సినిమాలకు మనోజ్ న్యాయం చేయగలరని చెబుతున్నాయి.
కాగా, మనోజ్ భవిష్యత్ లో ఇదే జోరు కొనసాగిస్తే.. ఆయనకు మంచి మంచి ప్రాజెక్ట్ లు వస్తాయి. అలాగే ఆయన రెమ్యూనరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇక మనోజ్ ఆఫ్ ది స్క్రీన్ కూడా గోల్డెన్ హార్టెట్. ఆయన ఫ్యాన్స్ ను బాగా పలకరిస్తారు. ప్రైవేట్ ఈవెంట్లు, ఆయన చలాకీతనం, ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే విధానం బాగుంటుంది. అదే అభిమానులతో ఆయనకు బలమైన బంధం ఏర్పర్చింది.
ఇలా ఆఫ్ స్క్రీన్ లో ఆయన మంచితనం.. కెరీర్ పరంగా భారీ మార్కెట్ ఏర్పరుకునేందుకు స్కోప్ ఇస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మనోజ్ వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు పొందారు. మిరాయ్ తర్వాత ఆయమ మరిన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండే ఛాన్స్ లు ఉన్నాయి.
