Begin typing your search above and press return to search.

ప్ర‌తి పున‌ర్జ‌న్మ‌లోనూ నువ్వే భర్త‌గా రావాలి

ఒక్క‌డు మిగిలాడు త‌ర్వాత మంచు మ‌నోజ్ నుంచి మ‌రో సినిమా వ‌చ్చింది లేదు. ఆ సినిమా వ‌చ్చి కూడా ఆరేళ్ల‌వుతుంది.

By:  Tupaki Desk   |   20 May 2025 5:34 PM IST
ప్ర‌తి పున‌ర్జ‌న్మ‌లోనూ నువ్వే భర్త‌గా రావాలి
X

ఒక్క‌డు మిగిలాడు త‌ర్వాత మంచు మ‌నోజ్ నుంచి మ‌రో సినిమా వ‌చ్చింది లేదు. ఆ సినిమా వ‌చ్చి కూడా ఆరేళ్ల‌వుతుంది. ఇప్పుడు ఆరేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌నోజ్ భైర‌వం సినిమాతో ఇండ‌స్ట్రీకి కంబ్యాక్ ఇవ్వ‌బోతున్నాడు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న భైర‌వం సినిమాలో మంచు మ‌నోజ్ కూడా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా మే 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ రిలీజ‌వ‌గా ఆ ట్రైల‌ర్ కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇదిలా ఉంటే ఇవాళ మంచు మనోజ్ పుట్టిన‌రోజు. మ‌నోజ్ బ‌ర్త్ డే సందర్భంగా అత‌నికి ప‌లువురు సెల‌బ్రిటీలు, ఫ్యాన్స్ విషెస్ చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి కూడా మ‌నోజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది.

నేను ప్రేమించే నా సోల్‌మేట్‌కు బ‌ర్త్ డే విషెస్. మా లైఫ్ లోకి వ‌చ్చి, నీ లైఫ్ జ‌ర్నీని మాతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా థాంక్స్. మా ప్రపంచాన్ని మీరెంతో అందంగా మార్చారు. మీరు చేసే, చేయ‌బోయే అన్ని ప‌నులు బాగా జ‌ర‌గాలి, ప్రేమ‌, ఆనందాన్ని పంచ‌డానికి మీ గుండె వెయ్యేళ్లు బ‌తకాలి. మేం నిన్నెంతగానో ప్రేమిస్తున్నాం. మా ముగ్గురి ప్రేమ మీ కోసం మాత్ర‌మే. మీరు నిజంగా రాకింగ్ స్టార్, నా ప్ర‌తి పున‌ర్జ‌న్మ‌లోనూ నా ఫ్రెండ్ గా, భ‌ర్త గా మిమ్మ‌ల్నే ఇవ్వాల‌ని దేవుడిని కోరుకుంటున్నా అంటూ పిల్ల‌ల‌తో పాటూ ఉన్న ఫోటోల‌ను షేర్ చేస్తూ భ‌ర్త‌పై ప్రేమ‌ను కురిపించింది మౌనిక‌.

మ‌నోజ్ భార్య మౌనిక షేర్ చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది. నెటిజ‌న్లు, మంచు అభిమానులు మౌనిక పోస్ట్ ను లైక్ చేస్తూ మ‌నోజ్ కు విషెస్ తెల‌ప‌డంతో పాటూ మీ కుటుంబం ఎప్ప‌టికీ సంతోషంగా ఉండాల‌ని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెరీర్ విష‌యానికొస్తే మ‌నోజ్ భైర‌వంతో పాటూ తేజ స‌జ్జ న‌టిస్తున్న మిరాయ్ లో కూడా న‌టిస్తున్నాడు. మ‌రి ఈ రెండు సినిమాలైనా మ‌నోజ్ కు మంచి ఫ‌లితాన్నిస్తాయో చూడాలి.