మంచులక్ష్మీ ఇంట క్రిస్మస్ వేడుకలు.. ముఖ్య అతిథులు వీరే!
ఒకప్పటితో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో కులమతాలకు అతీతంగా పండుగ ఏదైనా సరే సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు.
By: Tupaki Desk | 25 Dec 2025 12:49 PM ISTఒకప్పటితో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో కులమతాలకు అతీతంగా పండుగ ఏదైనా సరే సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకరితో ఒకరు కలగలసి ఆ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు క్రిస్మస్ పండుగ కావడంతో హిందువులు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా.. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
తాజాగా తన ఇంట జరిగిన క్రిస్మస్ వేడుకలకు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ , ప్రముఖ హోస్ట్ రియా చక్రవర్తి తోపాటు ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అలాగే మంచు లక్ష్మి తల్లి నిర్మల మంచు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. అలాగే మంచు లక్ష్మి సన్నిహిత స్నేహితులు కూడా ఈ వేడుకకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది ప్రగ్యా జైస్వాల్. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కూతురు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. మొత్తానికైతే క్రిస్మస్ వేడుకలను తన ఇంట్లో తన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య చాలా ఘనంగా జరుపుకున్నట్లు ఫోటోల ద్వారా తెలుస్తోంది. అటు మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు, నెటిజన్స్ ఆమెకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మంచు లక్ష్మి విషయానికి వస్తే.. అమెరికన్ టెలివిజన్లో హోస్ట్ గా పని చేస్తూ కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిజానికి నాలుగు సంవత్సరాల వయసులోనే తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె సుమారుగా 20 చిత్రాలలో నటించింది. నటి గానే కాకుండా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఈ నిర్మాణ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలను నిర్మించింది ఈ ముద్దుగుమ్మ. చివరిగా ఈ ఏడాది తన నిర్మాణ సంస్థ ద్వారా దక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక తెలుగులోనే కాకుండా తమిళ్ , మలయాళంలో కూడా చిత్రాలు చేసింది . అటు నిర్మాతగా కూడా మంచి మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించింది.
తన అద్భుతమైన నటనతో అనగనగా ఓ ధీరుడు చిత్రానికి ఉత్తమ సహాయ నటి విభాగంలో దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన ఈమె.. గుండెల్లో గోదారి, చందమామ కథలు చిత్రాలకు ఉత్తమ సహాయ నటి విభాగంలో సౌత్ ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకుంది. అలాగే అనగనగా ఓ ధీరుడు చిత్రానికి గాను ఉత్తమ లేడీ విలన్ కేటగిరీలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది.. అలా పలు చిత్రాలకు నామినేట్ అవ్వడమే కాకుండా అవార్డులు కూడా దక్కించుకుంది మంచు లక్ష్మి.
