ఆ రోజు అందుకే ఏడ్చా..
అయితే ఆ రోజు అంత ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణాన్ని మంచు లక్ష్మి రీసెంట్ గా ఓ కార్యక్రమంలో తెలిపింది.
By: Tupaki Desk | 8 May 2025 8:30 PMసినిమాలతోనే కాకుండా ఏదొక విషయంలో నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది మంచు ఫ్యామిలీ. ఈ మధ్య మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఆస్తి గొడవలు కుటుంబం దాటి రోడ్డెక్కిన విషయం అందరం చూశాం. అయితే ఈ గొడవల విషయంలో ఎప్పడూ మంచు లక్ష్మి ఇన్వాల్వ్ అయి మాట్లాడిందీ లేదు, ఎవరికీ సపోర్ట్ గా నిలిచిందీ లేదు.
ఈ గొడవలు జరుగుతున్న టైమ్ లోనే రీసెంట్ గా మంచు లక్ష్మి ఓ ఈవెంట్ లో పాల్గొనగా సడెన్ గా అక్కడికి వెళ్లి స్టేజ్ పై ఉన్న తన అక్క లక్ష్మిని సర్‌ప్రైజ్ చేశాడు మనోజ్. దీంతో లక్ష్మి ఒక్కసారిగా షాకై ఎంతో ఎమోషనల్ అయింది. ఆ టైమ్ లో మనోజ్ భార్య మౌనిక కూడా లక్ష్మిని ఓదార్చగా దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.
అయితే ఆ రోజు అంత ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణాన్ని మంచు లక్ష్మి రీసెంట్ గా ఓ కార్యక్రమంలో తెలిపింది. ఆ రోజు తాను అక్కడున్నప్పుడు అందరూ ఫ్యామిలీలతో వచ్చారని, కానీ తన ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదని, సడెన్ గా మనోజ్ ను అక్కడ చూసేసరికి సంతోషంతో ఎమోషనల్ అయ్యానని లక్ష్మి తెలిపింది.
తన లైఫ్ లో మనోజ్ చాలా ఇరిటేటింగ్ క్యారెక్టర్ అని, చెప్పకుండా సడెన్ గా వచ్చి కనిపించడంతో షాక్ అయ్యానని, మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఫ్యామిలీ మెయిన్ అని చెప్తూ ఎంతో ఎమోషనల్ గా ఆన్సర్ ఇచ్చింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా, ఈ సందర్భంగా మంచు లక్ష్మి తమ ఇంటి తగాదా గురించేమైనా మాట్లాడుతుందేమోనని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.