మంచు ఫ్యామిలీ ఇంట లంచ్- డిన్నర్ ఇలా!
By: Tupaki Desk | 22 July 2025 11:11 PM ISTపుడీ అంటే ఇండస్ట్రీ సహా అందిరికీ ముందుగా గుర్తొచ్చేది రెబల్ స్టార్ కృష్ణం రాజు ఫ్యామిలీ. రకరకాల వంట కాలతో విందు ఆరగించడం అన్నది ఆ ఫ్యామిలీ ప్రత్యేకత. అందులోనూ తప్పనిసరిగా నాన్ వెజ్ వంట కాలు ఉండాల్సిందే. ఆ విషయంలో కృష్ణంరాజు వారతసత్వాన్ని డార్లింగ్ ప్రభాస్ కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణం రాజు తరహాలోనే ఇంటికొచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపిచడమే కాకుండా సెట్స్ లో సహచరులను సైతం అంతే ప్రేమగా చూసుకోవడం డార్లింగ్ హాబీల్లో ఒకటిగా మారిపోయింది.
ఆ తర్వాత ఆ రేంజ్ పుడీ ప్రయులు ఎవరు అంటే పెద్దగా ఎవరూ కనిపించరు. కానీ తాజాగా ఆ తర్వాత స్థానంలో మంచు ఫ్యామిలీ ఉంది? అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విష్ణు కూడా మంచి పుడీ. అందులోనూ నాన వెజ్ ప్రియుడు. కన్నప్ప షూటింగ్ సమయంలో కూడా నాన్ వెజ్ తిన్నట్లు విష్ణు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు ఫ్యామిలీ ఇంట లంచ్..డిన్నర్ ఎలా ఉంటుందన్నది ఆ ఇంటి కోడలు...విష్ణు సతీమణి విరనిక రెడ్డి తెలిపారు. `మంచు ఫ్యామిలీ అంతా పుడ్ లవర్స్.
డైనింగ్ టేబుల్ పై లంచ్ సమయంలో తప్పని సరిగా ఆరు రకాల వంటకాలు ఉండాల్సిందే. అటుపై నైట్ డిన్నర్ సమయంలో కూడా ఆరు రకాలు తప్పనిసరి . మళ్లీ ఆ వారంలో రిపీటెడ్ ఐటమ్స్ ఉండకూడదు. కొత్త వంటకాలు మాత్రమే ఉండాలి. అందులో ఒక్క ఐటమ్ రిపీట్ అయినా ఎందుకు రిపీట్ అయిందని విష్ణు అడుగుతారు. లంచ్ సమయంలోనే నైట్ డిన్నర్ ఎలా ఉండాలి? అనే ప్రణాళిక కూడా సిద్దమ వుతుంద`న్నారు.
ఈ పనులన్నింటిని విరనిక చూసుకుంటారు. ఓ రకంగా ఈ విషయంలో కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుందని తెలిపారు. మంచు లక్ష్మీ ప్రసన్న కూడా పపుల్స్ చేయడంలో స్పెషలిస్ట్ . అలాగే ఎగ్ తో రకరకాల కర్రీలు చేయడంలోనూ లక్ష్మి సూపర్ స్పెషలిస్ట్. ఎగ్ వంటకాలన్నింటిని విదేశాల్లో నేర్చుకుని వచ్చినట్లు ఓ సందర్భంలో లక్ష్మీ తెలిపారు.
