Begin typing your search above and press return to search.

చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తున్న మానస వారణాసి!

అలాంటి వారిలో ప్రముఖ యంగ్ బ్యూటీ మానస వారణాసి కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిన్నది..

By:  Madhu Reddy   |   7 April 2026 9:00 PM IST
చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తున్న మానస వారణాసి!
X

సోషల్ మీడియాలో కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ తో ఆకట్టుకుంటే.. మరికొంతమంది సాంప్రదాయంగా కనిపించి మెస్మరైజ్ చేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యంగ్ బ్యూటీ మానస వారణాసి కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిన్నది.. తాజాగా చీర కట్టులో కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేసింది. హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ మిక్స్డ్ శారీ కట్టిన ఈమె బ్లౌజ్ పై గోల్డెన్ కలర్ తో హెవీ ఎంబ్రాయిడరీ డిజైన్ చేశారు.




ఇక నెక్ ను ఫుల్ ఫిల్ చేయడానికి డైమండ్స్ తో అందంగా డిజైన్ చేసిన నెక్లెస్ ధరించిన ఈమె.. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించి ఆకట్టుకుంది. నెక్లెస్ కి మ్యాచింగ్ గా డైమండ్స్ పొదిగిన బ్యాంగిల్స్ ధరించిన మానస.. తన అందాన్ని మరింత ఫుల్ ఫిల్ చేసుకుంది. జుట్టును వేవింగ్ చేసి వదిలేసిన మానస వారణాసి లుక్స్ చూసి అభిమానులు పర్ఫెక్ట్ లుక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లో ఒక కొత్త అడిషన్ ఈ ముద్దుగుమ్మ అంటూ కామెంట్ చేయడం గమనార్హం . ముఖ్యంగా మానస వారణాసి లుక్ చూసి అభిమానులు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.. గార్జియస్ అని కామెంట్ చేస్తుంటే.. మరొకరు ప్రతి వ్యక్తి జీవితంలో మిత్ర లాంటి అమ్మాయి తోడు కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మానస వారణాసి తాజాగా షేర్ చేసిన ఈ అవుట్ ఫిట్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.




తెలంగాణకు చెందిన మానస మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టి ..అందాల పోటీలలో విజేతగా నిలిచింది. 2020 మిస్ ఇండియా అందాల పోటీలలో కిరీటాన్ని అందుకున్న మానస వారణాసి.. 2021 మిస్ వరల్డ్ పోటీలలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి పదవ స్థానంలో నిలిచింది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన మానస ఫ్యాక్ట్ సెట్ లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ విశ్లేషకురాలిగా కూడా పనిచేసింది




ఫెమినా మిస్ తెలంగాణ 2019 అందాల పోటీలలో టాప్ త్రీ లో నిలిచిన మానస వారణాసి , ఫెమినా మిస్ ఇండియా 2020లో కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే 2024లో దేవకీ నందన వాసుదేవా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఇటీవల సంతోష్ శోభన్ తో కలిసి కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్ పై అజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అశ్విని చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఇకపోతే సంతోష్ శోభన్, మానస వారణాసి జంటకు అభిమానులు ఫిదా అయిపోయారు. పైగా ఈ జంట కాంబినేషన్లో మరో సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏది ఏమైనా మానసా వారణాసి అటు సినిమాలతో ఇటు అందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.