Begin typing your search above and press return to search.

మిత్ర క్యారెక్టర్ నా రియల్ లైఫ్ లాగే ఉంటుంది: మానస వారణాసి!

టాలీవుడ్ లో పరిచయం అవుతున్న కొత్త భామ, మిస్ ఇండియా మానస వారణాసి గురించి అందరికి పరిచయమే.

By:  Tupaki Desk   |   10 Feb 2026 8:00 PM IST
మిత్ర క్యారెక్టర్ నా రియల్ లైఫ్ లాగే ఉంటుంది: మానస వారణాసి!
X

టాలీవుడ్ లో పరిచయం అవుతున్న కొత్త భామ, మిస్ ఇండియా మానస వారణాసి గురించి అందరికి పరిచయమే. సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టే ప్రతి నటి తన తొలి పాత్ర చిరకాలం గుర్తుండిపోవాలని కోరుకుంటుంది. కానీ మిస్ ఇండియా మానస వారణాసికి మాత్రం 'కపుల్ ఫ్రెండ్లీ' రూపంలో తన మనసుకి నచ్చిన, తన వ్యక్తిత్వానికి అద్దం పట్టే 'మిత్ర' పాత్ర దొరికింది. వెండితెరపై మిత్రగా తను పండించిన భావోద్వేగాలు కేవలం నటన మాత్రమే కాదు, అది తన నిజ జీవిత ప్రతిబింబం అని, తాజాగా జరిగిన మూవీ ప్రెస్ మీట్ లో మానస చెబుతున్న మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వివరాలలోకి వెళితే..

మానస మనసులో మాట:

ప్రెస్ మీట్‌లో మానస వారణాసి మాట్లాడుతూ, 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలో తాను పోషించిన 'మిత్ర' పాత్ర తన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా నేటి తరం యువతుల్లో ఉండే 'ఓవర్ థింకింగ్' స్వభావాన్ని పక్కన పెట్టి, స్వతంత్రంగా బతకాలని మిత్ర కోరుకుంటుందని, తను కూడా నిజ జీవితంలో అదే సూత్రాన్ని పాటిస్తానని చెప్పారు. ఈ సినిమాలో శివ-మిత్రల యాక్టింగ్ కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాత ప్రశంసలు:

ఈ చిత్రం కేవలం ఒక రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు, ఒకరి కోసం ఒకరు పడే తపన అని హీరో సంతోష్ శోభన్ పేర్కొన్నారు. "మిత్ర లేనిదే శివ లేడు" అనే మాట సినిమాలోని గాఢతను తెలియజేస్తోంది. సంతోష్ శోభన్ నటన గురించి నిర్మాత మాట్లాడుతూ, ఆయన ఎమోషన్స్ పండించడంలో దిట్ట అని, ఆయన నవ్వితే మనం నవ్వుతామని, ఆయన కళ్ళలో నీళ్లు తిరిగితే ప్రేక్షకుల హృదయాలు బరువెక్కుతాయని కొనియాడారు. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్‌లో సంతోష్ విశ్వరూపం చూపిస్తారని, మిత్ర కోసం శివ చేసే పోరాటం ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. నేటి తరం జంటల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, పెద్ద ఎమోషన్స్‌ను ఈ సినిమా అద్భుతంగా ఆవిష్కరించబోతోంది.

ఒక ఆసక్తికరమైన ప్రయాణం..

మొత్తానికి 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రెస్ మీట్ ద్వారా చిత్ర యూనిట్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇది కేవలం వినోదం కోసమే కాదు, నేటి యువత ఆలోచనా దృక్పథాన్ని, వారి వ్యక్తిగత స్వతంత్రతను గౌరవించే ఒక స్వచ్ఛమైన కథగా తెరకెక్కింది. మిస్ ఇండియా మానస వారణాసి తన సహజత్వంతో, సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించగా, సంతోష్ శోభన్ తన అద్భుతమైన ఎమోషనల్ యాక్టింగ్‌తో సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించారు. ఈ అందమైన ప్రేమకథ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందో చూడాలి.