Begin typing your search above and press return to search.

శర్వా మనమే.. 3రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

ఇప్పుడు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 2:15 PM GMT
శర్వా మనమే.. 3రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
X

టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మూవీ రిజల్ట్ తో ఏమాత్రం సంబంధం లేకుండా చిత్రాలు చేసే శర్వా.. రెండేళ్ల గ్యాప్ తర్వాత మనమేతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలయ్యింది. ఇప్పుడు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.


భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ రూపొందించిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్ కృతి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్ పోషించింది. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీలో మొత్తంగా 16 పాటలు ఉండడం విశేషం. జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనమే సినిమా.. పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతోంది.

ఫస్ట్ డే కన్నా సెకండ్ డే ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. ఇప్పుడు మూడో రోజు రెండో రోజు కన్నా ఎక్కువ వసూళ్లు సాధించింది. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. దాంతో పాటు మూడు రోజుల బాక్సాఫీస్ లెక్కలను ప్రకటించారు. వరల్డ్ వైడ్ గా మూడు రోజులకు గాను మనమే చిత్రం రూ.13.87 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. సమ్మర్ బ్లాక్ బస్టర్ ను అస్సలు మిస్ కావొద్దని ట్వీట్ చేశారు.

దీన్ని బట్టి చూస్తే.. మనమే చిత్రం పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతున్నట్లు అర్థమవుతుంది. ఇదే టాక్ కంటిన్యూ అయితే.. త్వరలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకుంటుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ కు ఫ్యామిలీ ఆడియెన్స్.. థియేటర్లకు బాగా వచ్చినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా శర్వానంద్, కృతి శెట్టికి మంచి హిట్ దక్కేలా కనిపిస్తుందని అంటున్నారు. మూవీలో కూడా ఇద్దరూ యాక్టింగ్ ఇరగదీశారని ప్రశంసిస్తున్నారు.

మరోవైపు, మూవీ రిలీజ్ అయ్యాక కూడా మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని అనేక థియేటర్లకు వెళ్లి డైరెక్ట్ గా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తెలుసుకుంటున్నారు హీరో శర్వానంద్. సెల్ఫీ వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మేకర్స్ కూడా వాటిని షేర్ చేస్తున్నారు. సినిమాలోని స్పెషల్ సీన్స్ ను కూడా పోస్ట్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. మరి థియేట్రికల్ రన్ లో మనమే మూవీ ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.