Begin typing your search above and press return to search.

'మనమే' బుకింగ్స్.. ఈ రేంజ్ లో కొనసాగితే..

టాలీవుడ్ లో డిఫరెంట్ కథలతో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు హీరో శర్వానంద్.

By:  Tupaki Desk   |   8 Jun 2024 6:07 AM GMT
మనమే బుకింగ్స్.. ఈ రేంజ్ లో కొనసాగితే..
X

టాలీవుడ్ లో డిఫరెంట్ కథలతో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు హీరో శర్వానంద్. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునే విధంగా ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కొనసాగుతున్న తన కెరీర్ ఇప్పుడు మనమే సినిమాతో మరో సక్సెస్ అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం స్టడీ గానే ఉన్నాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనమే సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఇక ఈ యంగ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మొదటి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది.

రివ్యూలు కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి వల్గారిటీ లేకుండా చాలా క్లీన్ మూవీ అని మరొక టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా మెల్లమెల్లగా పెరుగుతోంది. ఇక వీకెండ్ కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. పోటీగా కూడా పెద్దగా సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఈ వారం మనమే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది.

శనివారం కూడా అడ్వాన్స్ బుకింగ్ తో ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. చివరి 24 గంటలలో ఈ సినిమాకు బుక్ మై షో లో 55 వేలకు పైగా టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి సినిమాకు ఆదరణ ఏ తరహాలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మనమే సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఆమె కూడా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి రావాలని అనుకుంటుంది. ఇక సినిమాకు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక శనివారం కూడా ఇదే తరహాలో రెస్పాన్స్ అందితే ఆదివారం కూడా కలిసి వచ్చినట్టే. ఈ వారంలోనే సినిమా ఇలానే కలెక్షన్స్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా తొందరగానే పూర్తవుతుంది. మరి మనమే సినిమా మొత్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.