Begin typing your search above and press return to search.

శర్వా మనమే.. ఆడియన్స్ కు ఫుల్ మీల్స్!!

యంగ్ హీరో శర్వానంద్ పేరు వింటే చాలు.. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ప్రేమ కథలు వంటి ఫీల్ గుడ్ చిత్రాలు గుర్తొస్తాయి.

By:  Tupaki Desk   |   5 Jun 2024 10:47 AM GMT
శర్వా మనమే.. ఆడియన్స్ కు ఫుల్ మీల్స్!!
X

యంగ్ హీరో శర్వానంద్ పేరు వింటే చాలు.. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ప్రేమ కథలు వంటి ఫీల్ గుడ్ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే రెండేళ్ల గ్యాప్ తర్వాత శర్వా.. ఇప్పుడు మరో ఫీల్ గుడ్ మనమే మూవీతో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో బ్యూటిఫుల్ కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. సరికొత్త కథతో రూపొందిన ఈ చిత్రం.. జూన్ 7వ తేదీన విడుదల కానుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ కూడా క్లీన్ హిట్ అవుద్దని నమ్మకంతో ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. తొలుత పిఠాపురంలో ఈ వేడుక జరగనున్నట్లు వార్తలు వచ్చినా.. హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. రవితేజ గెస్ట్ గా వస్తారని టాక్.

అయితే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా మంచి బజ్ క్రియేట్ అవ్వడంతో ఈ మూవీ కోసం నెట్టింట జోరుగా చర్చగా సాగుతోంది. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలుగా తెలుస్తోంది. మొత్తం సినిమా ద్వారా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఆడియన్స్ ను ఓ అందమైన ప్రపంచంలోకి తీసుకెళ్తారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

సినిమాలో కామెడీ, ఎమోషన్స్ సరైన రీతిలో మేకర్స్ యాడ్ చేసినట్లు తెలుస్తోంది. మూవీలో శర్వానంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ లో ఉంటుందని టాక్. మోస్ట్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అలరిస్తారని సమాచారం. హీరోయిన్ కృతి శెట్టి.. మూవీలో తన అందం, అభినయంతో తనదైన శైలిలో సినీ ప్రియులను మెప్పిస్తుందని వినికిడి.

మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఆమెకు దక్కిందని అంటున్నారు. మూవీలోని పాటలన్నీ మ్యూజిక్ పరంగా.. విజువల్స్ పరంగా సూపర్ హిట్ అవుతాయని చెబుతున్నారు. సినిమా అంతటికీ చివరి 40 నిమిషాలు హైలైట్ అంట. వెన్నెల కిషోర్ ఉన్న సీన్స్ చూసి కడుపుబ్బా నవ్వుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ లో ఉన్న పిల్లవాడు.. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని వినికిడి. మొత్తంగా మూవీ అంతా ఫుల్ మీల్స్ భోజనంలా ఉంటుందని తెలుస్తోంది. మరి రిలీజ్ అయ్యాక మనమే చిత్రం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.