Begin typing your search above and press return to search.

శర్వా 'మనమే' సెన్సార్.. ఇదీ మ్యాటర్!

డైనమిక్ హీరో శర్వానంద్.. రెండేళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత చేస్తున్న సినిమా మనమే.

By:  Tupaki Desk   |   4 Jun 2024 11:06 AM GMT
శర్వా మనమే సెన్సార్.. ఇదీ మ్యాటర్!
X

డైనమిక్ హీరో శర్వానంద్.. రెండేళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత చేస్తున్న సినిమా మనమే. చివరగా 2022లో ఒకే ఒక్క జీవితం సినిమాతో సందడి చేసిన శర్వా.. ఇప్పుడు వరుస చిత్రాలను లైన్ లో పెట్టేశారు. కంటిన్యూగా షూటింగ్స్ పాల్గొంటున్నారు. మరో మూడు రోజుల్లో మనమే మూవీతో సందడి చేయనున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన ఉప్పెన బేబమ్మ కృతి శెట్టి యాక్ట్ చేస్తోంది.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ గ్రాండ్ గా మనమే చిత్రాన్ని నిర్మించారు. సినిమా షూటింగ్ లో చాలా భాగం లండన్ లోనే షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు కలర్ ఫుల్ గా ఆకట్టుకున్నాయి. రెండు పాటలు, టీజర్, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అలా మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. జూన్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు ప్రకటించారు. పోస్టర్ లో శర్వానంద్, కృతి క్రేజీగా కనిపించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అన్ని పోస్టర్లలో ఉన్న బాబు కూడా ఉన్నాడు. ఆ బుడ్డోడు సినిమాలో హైలెట్ గా నిలిచేలా కనిపిస్తున్నాడు.

అయితే పెళ్లి కాని ఓ జంట.. ఒక బాబు పెంచాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే పాయింట్ చుట్టూ మనమే సినిమా తిరుగుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. లవ్, కామెడీ, మ్యూజిక్.. అలా అన్నీ యాడ్ చేస్తూ మేకర్స్ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా మూవీలో శర్వానంద్ చాలా స్టైలిష్ గా, కృతి శెట్టి సో బ్యూటిఫుల్ గా కనిపించనున్నట్లు ఈజీగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. పిఠాపురంలో ఆ ఈవెంట్ జరగనుందని, మెగా హీరో రామ్ చరణ్ గెస్ట్ గా వస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వేడుక హైదరాబాద్ లోనే జరగనుందని లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిథిగా వస్తారని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఇవ్వనున్నారని టాక్.