Begin typing your search above and press return to search.

80 ఏళ్ల ముస‌లొళ్ల మ‌ధ్య‌న 35 ఏళ్ల కుర్రాడిలా మ‌మ్ముట్టి!

మ‌ల‌యాళం సూపర్ స్టార్ మ‌మ్ముట్టి వ‌య‌సు ఎంతో తెలుసా? అక్ష‌రాల 72 ఏళ్లు. మ‌న‌వ‌లు..మ‌న‌వ‌రాళ్ల‌తో ఇంట్లో ఆడుకోవాల్సిన వ‌య‌సు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 7:14 AM GMT
80 ఏళ్ల ముస‌లొళ్ల మ‌ధ్య‌న 35 ఏళ్ల కుర్రాడిలా మ‌మ్ముట్టి!
X

మ‌ల‌యాళం సూపర్ స్టార్ మ‌మ్ముట్టి వ‌య‌సు ఎంతో తెలుసా? అక్ష‌రాల 72 ఏళ్లు. మ‌న‌వ‌లు..మ‌న‌వ‌రాళ్ల‌తో ఇంట్లో ఆడుకోవాల్సిన వ‌య‌సు. కానీ ఆయ‌న ఎంత చ‌లాకీగా సినిమాలు చేస్తున్నారో చూస్తునే ఉన్నాం. 72 ఏళ్ల వ‌య‌సులోనూ ఏడాదికి ఆరేడు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. డే అండ్ నైట్ షూటింగ్ చేయ‌డం అన్న‌ది మ‌మ్ముట్టికి...మోహ‌న్ లాల్ కి మాత్ర‌మే సాధ్య‌మైంది. ఇండియాలో ఇంకే న‌టుడు వాళ్లిద్ద‌రిలో సినిమాలు చేయ‌లేరు. అది మిగ‌తా న‌టుల‌కు సాధ్య‌మ‌య్యే ప‌ని కూడా కాదు.


తాజాగా మమ్ముట్టి 72 ఏళ్ల వ‌య‌సులో 35 ఏళ్ల కుర్రాడిలో 80 ఏళ్ల వ‌య‌సున్న ముస‌లాళ్ల మ‌ధ్య‌న క‌నిపిం చ‌డం విశేషం. వివ‌రాల్లోకి వెళ్తే.. ఎర్నాకులంలోని మహారాజాస్ కాలేజీకి చెందిన తన క్లాస్‌మేట్స్ అంతా గెట్ టూ గెద‌ర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ వేడుక‌లో మ‌మ్ముట్టి కూడా పాల్గొన్నారు. మమ్ముట్టి బ్యాచ్ మేట్స్ అంతా త‌ల‌..గెడ్డం ప‌డిపోయి 80-85 ఏళ్లు పై బ‌డి వృద్ధాప్యంలో క‌నిపిస్తున్నారు. నిజానికి వారంద‌రిక వ‌య‌సు 72-73 మ‌ధ్య‌నే ఉంటుంది.

కానీ మ‌మ్ముట్టి మాత్రం 72 ఏళ్ల వ‌య‌సులోనూ 35 ఏళ్ల కుర్రాడిలో క‌నిపిస్తున్నారు. తెల్ల పంచె.. ష‌ర్ట్ ధ‌రించి క‌నిపిస్తున్నారు. తల వెంట్రుక ఒక్క‌టి కూడా నెర‌వ‌లేదు. ఈ గ్యాంగ్ మ‌ధ్య‌లో మమ్ముట్టిని చూస్తుంటే వాళ్ల‌కే కుమారిడిలా క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. మ‌మ్ముట్టి కి 72 ఏళ్ల వ‌య‌సంటే న‌మ్మ‌డ క‌ష్టంగానే ఉంది. మమ్ముట్టి న‌టుడు కావ‌డంతోనే ఇలా య‌వ్వ‌నంగా క‌నిపిస్తున్నారు.

ఆయ‌న జీవిన విధానంతోనే ఇది సాధ్య‌మైంది. సెల‌బ్రిటీల లైఫ్ స్టైల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఉద‌యానే వ్యాయామం...యోగా ...మిత‌మైన ఆహారం వంటివి ఇలా య‌వ్వ‌నంగా ఉంచుతాయి. ఇలా మెయింటెన్ చేస్తే? ఎవ‌రికైనా సాధ్య‌మే? అందుకు సెల‌బ్రిటీలే అర్హులు అనుకోవ‌డం అపోహ మాత్ర‌మే.