Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మూవీ తెలుగు రిలీజ్ లేనట్లేనా...?

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు 'యాత్ర 2' సినిమాతో వచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   13 Feb 2024 9:42 AM GMT
మెగాస్టార్ మూవీ తెలుగు రిలీజ్ లేనట్లేనా...?
X

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు 'యాత్ర 2' సినిమాతో వచ్చిన విషయం తెల్సిందే. గతంలో యాత్ర లో నటించిన మమ్ముట్టి యాత్ర 2 లో గెస్ట్‌ అప్పియరెన్స్ లో నటించి మెప్పించాడు. ఇక ఆయన మలయాళ చిత్రం 'బ్రహ్మయుగం' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో ఆధరన లభిస్తోంది. అందుకే బ్రహ్మయుగం సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయాలని భావించారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరిగాయి. కానీ తెలుగు లో విడుదల చేయబోవడం లేదు అంటూ చివరి నిమిషంలో యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.

తెలుగు లో సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయడంతో పాటు డబ్బింగ్‌ పనులు కూడా పూర్తి చేసిన తర్వాత చివరకు ఇలాంటి ట్విస్ట్‌ ఇచ్చారు ఏంటో అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి ఆమడ దూరంలో ఉండే విధంగా బ్రహ్మయుగం సినిమా ఉంటుందట.

తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఈ సినిమాకు కనెక్ట్‌ అవ్వక పోవచ్చు అని చాలా మంది అనుకుంటున్నారట. అందుకే ఈ సినిమాను తెలుగు లో థియేటర్ల ద్వారా విడుదల చేయడం వృధా ప్రయాస అవుతుందని అనుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

మమ్ముట్టి కి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్నా కూడా ఈ సినిమా థియేటర్లలో ఎంత మాత్రం పని చేయక పోవచ్చు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే థియేటర్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్‌ గా బ్రహ్మయుగం సినిమా ను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.