Begin typing your search above and press return to search.

హారర్​ థ్రిల్లర్​గా మెగాస్టార్​ కొత్త మూవీ.. పోస్టర్ ఎలా ఉందంటే..

ఆయన కొత్త సినిమా ఒకటి లాంఛనంగా ప్రారంభమైంది. భ్రమయుగం టైటిల్‌తో ఈ సినిమా రానుంది. డార్క్‌ షేడ్స్‌లో రిలీజ్ చేసిన పోస్టర్​ను ఇంట్రెస్టింగ్​గా ఉంది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 11:21 AM GMT
హారర్​ థ్రిల్లర్​గా మెగాస్టార్​ కొత్త మూవీ.. పోస్టర్ ఎలా ఉందంటే..
X

మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికి కూడా బాగా తెలిసిన నటుడు​ మమ్ముట్టి. ఆయన్ను మలయాళ మెగాస్టార్ అంటుంటారు. తెలుగులోనూ మంచి సినిమాలు చేసి ఇక్కడి వారికి బాగా దగ్గరయ్యారు. పాన్ ఇండియా ఇమేజ్‌ ఉన్న స్టార్ హీరోల్లో ఆయన ఒకరు. ఈ ఏడాది టాలీవుడ్​లో ఏజెంట్‌ సినిమాలో కీలక పాత్ర పోషించి ఇక్కడి ప్రేక్షకుల్ని పలకరించారు మమ్ముట్టి.


అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఊహించని డిజాస్టర్​ను అందుకుని బోల్తా కొట్టింది. అయితే ఆయన మలయాళంలో చాలా కాలంగా నటనకు ప్రాధాన్యత ఉన్న నేచురల్​ కథల సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఓ బడా హారర్ థ్రిల్లర్​ సినిమాకు శ్రీకారం చుట్టారు.

ఆయన కొత్త సినిమా ఒకటి లాంఛనంగా ప్రారంభమైంది. భ్రమయుగం టైటిల్‌తో ఈ సినిమా రానుంది. డార్క్‌ షేడ్స్‌లో రిలీజ్ చేసిన పోస్టర్​ను ఇంట్రెస్టింగ్​గా ఉంది. అందులో ఓ బడా ఇల్లు.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకుని నిల్చొని ఉన్నాడు. అలాగే ఆ ఇంటి వెనక భారీ కొండలు, పైన భూతాలాంటి వ్యక్తులు కనిపించడం అంతా ఆసక్తికరంగా ఉంది. సినిమాపై మంచి ఉత్సుకతను రేపింది.

ఇక ఈ సినిమాకు రాహుల్‌ శశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నైట్ షిపట్​ స్డూడియోస్​, వై నాట్ స్టూడియో బ్యానర్లపై మూవీని నిర్మిస్తున్నారు. చక్కవర్తి రామచంద్ర, ఎస్​ శశికాంత్​ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా కలిసి మమ్ముట్టితో కలిసి సినిమా చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సినిమా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇంకా ఈ సినిమాలో అర్జున్ అశోకన్​, సిద్ధార్థ్​ భరతన్​, అమల్దా లిజ్​ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షెహ్నాద్​ జలాల్​ సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరిస్తున్నారు. జోతిశ్ శంకర్​ ప్రొడక్షన్ డిజైనర్​గా, షాఫిక్ మహ్మద్​ అలీ ఎడిటర్​గా, క్రిస్టో.. మ్యూజిక్​, టీడీ రామకృష్ణన్​ డైలాగ్స్​ను అందిస్తున్నారు. సినిమాను వరల్డ్ వైడ్​గా మలయాళ, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 2024లో విడుదల కానుంది.

ఇకపోతే మమ్ముట్టి ఈ చిత్రంతో పాటు మరి కొన్ని చిత్రాలు చేస్తున్నారు. వాటిలో గేమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న బజూక కూడా ఒకటి. డీనో డెన్నిస్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై కూడా మంచి బచ్ ఉంది. గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, టామ్‌ షైన్‌ ఛాకో, సుమిత్‌ నావల్‌, సిద్దార్ధ్‌ భరతన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.