Begin typing your search above and press return to search.

పోగొట్టుకున్న‌ప్పుడే వాటి విలువ తెలిసింది

మలయాళ చిత్రసీమలో ఐదు దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న లెజెండరీ హీరో మ‌మ్ముట్టి జీవితం మరోసారి ఓ గొప్ప పాఠాన్ని గుర్తు చేస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Feb 2026 12:00 AM IST
పోగొట్టుకున్న‌ప్పుడే వాటి విలువ తెలిసింది
X

మలయాళ చిత్రసీమలో ఐదు దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న లెజెండరీ హీరో మ‌మ్ముట్టి జీవితం మరోసారి ఓ గొప్ప పాఠాన్ని గుర్తు చేస్తోంది. ఎప్పుడైనా ఒక దాని విలువ అది మ‌న వ‌ద్ద ఉన్నప్పుడు తెలియ‌ద‌ని, వాటిని కోల్పోయిన క్షణంలోనే వాటి అసలు అర్థం, విలువ తెలుస్తుందని మ‌మ్ముట్టి చెప్తున్నారు. 400కు పైగా సినిమాల్లో నటించి, వైవిధ్యభరితమైన కథలు, లోతైన పాత్రలు, స్పెష‌ల్ డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మమ్ముట్టి గతేడాది కొద్ది నెలల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా స్పందిస్తూ ఆ కాలం ఎంత క్లిష్టంగా గడిచిందో వెల్లడించారు.

చిన్న విష‌యాలే ఎంతో ముఖ్య‌మ‌ని తెలుసుకున్నా

గ‌తేడాది జూన్‌లో తీవ్ర అనారోగ్యానికి గురైన తాను దాదాపు నాలుగు నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో రుచి, వాసన గుర్తించే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయానని చెప్పిన ఆయన, “గాలి పీల్చుకున్నా ఎలాంటి వాసన తెలియకపోవడం ఎంతో భయంకరంగా అనిపించిందని భావోద్వేగానికి గురయ్యారు. సాధారణంగా మనం ఇలాంటి వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోమ‌ని, కానీ ఈ చిన్న చిన్న విష‌యాలే ఎంత పెద్ద‌వ‌నేది త‌న‌కు అప్పుడే అర్థ‌మైంద‌న్నారు.

వారి ప‌రిస్థితి ఎంత క‌ష్ట‌మో అనిపించింది

రుచి తెలియకపోవడం, వాసన రాకపోవడం వ‌ల్ల జీవితం ఎంత వెలితిగా మారిపోతుంద‌ని త‌న‌కు తెలుస‌ని, ఆ స్టేజ్ ను తాను అనుభవించానని మ‌మ్ముట్టి చెప్పారు. వినికిడి, చూపు లాంటివి లేకుండా జీవించే వారి సిట్యుయేష‌న్ ఎంత కఠినమో త‌న‌కు అప్పుడే స్పష్టంగా తెలిసిందని ఈ సంద‌ర్భంగా మ‌మ్ముట్టి పేర్కొన్నారు. అయితే తాను నెమ్మదిగా కోలుకుని ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని మ‌మ్ముట్టి త‌న ఫ్యాన్స్ కు చెప్పారు. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందు నిలబడి షూటింగ్‌లలో పాల్గొంటున్నానని కూడా ఆయ‌న వెల్లడించారు.

మ‌మ్ముట్టి ప్ర‌స్తుతం మ‌హేష్ నారాయ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పేట్రియాట్ సినిమాలో న‌టిస్తుండ‌గా, ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్ గా, ఫ‌హ‌ద్ ఫాసిల్ విల‌న్ గా క‌నిపించ‌నున్నారు. ఏప్రిల్ 23న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 1971లో చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసిన మమ్ముట్టి, మొద‌ట్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించారు. త‌ర్వాత ప‌దేళ్ల‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చి అప్ప‌ట్నుంచి స‌క్సెస్‌ఫుల్ కెరీర్ ను కొన‌సాగిస్తున్నారు.