Begin typing your search above and press return to search.

మాలీవుడ్ మెగాస్టార్‌కు క్యాన్స‌ర్.. ఇదీ అస‌లు నిజం

స్నేహితుడు బ్రిట్టాస్ వివ‌ర‌ణ ఇవ్వ‌క ముందే, మ‌మ్ముట్టి బృందం క్యాన్స‌ర్ అనే ప్ర‌చారాన్ని తిప్పి కొట్టింది.

By:  Tupaki Desk   |   20 Jun 2025 4:00 AM IST
మాలీవుడ్ మెగాస్టార్‌కు క్యాన్స‌ర్.. ఇదీ అస‌లు నిజం
X

మాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు మ‌మ్ముట్టి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన సంగ‌తి త ఎలిసిందే. ఆయ‌న ఇటీవ‌ల వ‌య‌సు సంబంధ స‌మ‌స్య‌లతో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే 73 ఏళ్ల మ‌మ్ముట్టికి క్యాన్స‌ర్ అంటూ ఒక ప్ర‌చారం ఊపందుకుంది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. సమాధానాల కోసం వెతుకుతున్న అభిమానులు ఆందోళన చెందారు. ఇటీవ‌లే మ‌మ్ముట్టి టీమ్ ఆ వార్తలను త‌ప్పుడు ప్ర‌చారంగా కొట్టి పారేసారు. తాజాగా మమ్ముట్టి సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ మమ్ముట్టి ఆరోగ్యం గురించి వివ‌ర‌ణ ఇచ్చారు.

ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో జాన్ బ్రిట్టాస్ మ‌ట్లాడుతూ...''మ‌మ్ముట్టి అనారోగ్యంతో ఉన్న మాట వాస్త‌వం. కానీ అది చిన్న స‌మ‌స్య‌. దానికి చికిత్స పొందుతున్నారు. ఆయన బాగానే ఉన్నారు.. ఇది పెద్ద స‌మ‌స్య కాదు. వ్య‌క్తిగ‌త విష‌యాలు మేము మాట్లాడుకునేది త‌క్కువే అయినా, నేను ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను'' అని అన్నారు.

స్నేహితుడు బ్రిట్టాస్ వివ‌ర‌ణ ఇవ్వ‌క ముందే, మ‌మ్ముట్టి బృందం క్యాన్స‌ర్ అనే ప్ర‌చారాన్ని తిప్పి కొట్టింది. అవ‌న్నీ న‌కిలీ వార్త‌లు అని కొట్టి పారేసారు. మ‌మ్ముట్టి రంజాన్ ఉపవాసం ఉన్నందున ఆయ‌న సెలవులో ఉన్నాడు. ఆ కారణంగా తన షూటింగ్ షెడ్యూల్ నుండి కూడా విరామం తీసుకున్నారు. వాస్తవానికి విరామం తర్వాత మోహన్ లాల్ తో కలిసి మహేష్ నారాయణన్ సినిమా షూటింగ్ కు తిరిగి వెళ్తాడు అని తెలిపారు. మ‌మ్ముట్టి న‌టించిన మ‌ల‌యాళ చిత్రం జ‌బూకా ఇంత‌కుముందు విడుద‌లై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కలాంకావల్ విడుదల కోసం వేచి చూస్తున్నాడు. ఇది నూతన దర్శకుడు జితిన్ కె. జోస్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్. ఆగస్టు 1న థియేటర్లలో విడుదల కానుంది. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో మమ్ముట్టి ఒక భారీ చిత్రంలో న‌టిస్తారు. దీనికి తాత్కాలికంగా MMMN (పేట్రియాట్) అని పేరు పెట్టారు. మోహ‌న్ లాల్ ఇందులో అతిథి పాత్ర‌లో న‌టిస్తారు.