Begin typing your search above and press return to search.

తండ్రి 400 అయితే త‌న‌యుడు 40!

మాలీవుడ్ స్టార్ మ‌మ్ముట్టి న‌టుడిగా ఇప్ప‌టికే 400 సినిమాలు పూర్తి చేసారు. ఐదు ద‌శాబ్దాల కెరీర్ లో మ‌మ్ముట్టి ట్రాక్ రికార్డు ఇది.

By:  Tupaki Desk   |   5 May 2025 1:00 PM IST
తండ్రి 400 అయితే త‌న‌యుడు 40!
X

మాలీవుడ్ స్టార్ మ‌మ్ముట్టి న‌టుడిగా ఇప్ప‌టికే 400 సినిమాలు పూర్తి చేసారు. ఐదు ద‌శాబ్దాల కెరీర్ లో మ‌మ్ముట్టి ట్రాక్ రికార్డు ఇది. న‌టుడిగా మూడు షిప్టులు ప‌నిచేయ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. 1971లో మమ్ముట్టి కెరీర్ మొద‌లైంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ నిరంత‌రం ప‌నిచేస్తూనే ఉన్నారు. మ‌మ్ముట్టి వ‌య‌సు ఏడు ప‌దులు దాటినా ఇప్ప‌టికీ అంతే యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు.

మ‌ల‌యాళంతో పాటు త‌మిళం, తెలుగు భాష‌ల్లో సైతం సినిమాలు చేసిన లెజెండ్. ఆయ‌న‌కు పోటీగా కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ కూడా 400 సినిమాల‌కు అతి చేరువ‌లో ఉన్నారు. అయితే మ‌మ్ముట్టి త‌న‌యు డు దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా అప్పుడే 40 సినిమాలు పూర్తి చేసాడు. 13 ఏళ్ల కెరీర్ లోనే 40 సినిమాలు పూర్తి చేసాడు. 2012లో `సెకెండ్ షో` చిత్రంతో లాంచ్ అయ్యాడు. అటుపై ఎక్క‌డా ఇంత వ‌ర‌కూ గ్యాప్ తీసుకోకుండా ప‌నిచేసాడు.

తెలుగులో `సీతారామం` సినిమాతో లాంచ్ అయ్యాడు. ఈ సినిమా త‌ర్వాత టాలీవుడ్ లో అత‌డి రేంజ్ మారిపోయింది. మ‌ల‌యాళ న‌టుడైనా తెలుగు న‌టుడిగా ఇక్క‌డ ఆడియ‌న్స్ ఆయ‌న్ని ఆరాధించ‌డం మొద‌లు పెట్టారు. `ల‌క్కీ భాస్క‌ర్` తో మ‌రింత రీచ్ అయ్యాడు. ఈ రెండు విజ‌యాలు దుల్క‌ర్ ని తెలుగు న‌టుడిని చేసేసాయి. ప్ర‌స్తుతం సొంత భాష‌లో కంటే తెలుగులోనే సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు. `ఆకాశంలో ఒక తార` అంటూ ఓ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.

ఇక దుల్క‌ర్ 40వ సినిమా ఏది అంటే `ఐయామ్ గేమ్`. ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తూ తానే స్వ‌యంగా నిర్మిస్తున్నాడు. న‌హాస్ ఇదాయ‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌లే తిరువ‌నంతపురంలో ప్రారంభ‌మైన చిత్రం దుల్క‌ర్ కెరీర్ లోనే తొలి భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కుతుంది. ఇది భారీ యాక్ష‌న్ థ్రిల్లర్ అని స‌మాచారం.