Begin typing your search above and press return to search.

ప్రేమలు పాప.. కాస్త జాగ్రత్తగా వెళితే..

టీనేజ్ లోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మమిత.. తన యాక్టింగ్ కు గాను ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.

By:  Tupaki Desk   |   13 March 2024 11:15 AM GMT
ప్రేమలు పాప.. కాస్త జాగ్రత్తగా వెళితే..
X

'గీతాంజలి ఫేం గిరిజ, సాయి పల్లవి లానే మమిత కూడా యూత్ హార్ట్ త్రోబ్ అవుతుంది..' దర్శకధీరుడు రాజమౌళి నిన్న ప్రేమలు మూవీ తెలుగు వెర్షన్ సక్సెస్ ఈవెంట్ లో చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇవి. ఇప్పుడు మమిత గురించే అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అటు సోషల్ మీడియాలో.. ఇటు సినీ వర్గాల్లో ఈ కేరళ కుట్టీ గురించే తెగ మాట్లాడుకుంటున్నారు.

మలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమలులో లీడ్ రోల్ లో నటించిందీ మమిత బైజు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రేణు పాత్రలో తన నటనతో అదరగొట్టేసింది. బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన కేరళలో రిలీజైన ఈ మూవీ అక్కడ యువతను ఒక ఊపు ఊపేసింది. రీసెంట్ తెలుగులో కూడా విడుదలైంది. అయితే తెలుగులో అంచనాలను అందుకోలేకపోయింది. కాని మమిత ఒక్కసారిగా సౌత్ సినీ ఇండస్ట్రీ దృష్టంతా తన వైపు తిప్పుకుంది.

2017లో ఓ మలయాళ సినిమా ద్వారా మాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మమిత. ఆ తర్వాత ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకులను అలరించింది. టీనేజ్ లోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మమిత.. తన యాక్టింగ్ కు గాను ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఇప్పటి వరకు 16 సినిమాలు చేసిన ఈ బ్యూటీకి ప్రేమలు ఇచ్చిన క్రేజ్ ఏ మూవీ కూడా ఇవ్వలేదని చెప్పవచ్చు.

ఇటీవల ఈ అమ్మడు.. కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. జీవీ ప్రకాష్ కుమార్ కు జోడీగా రెబల్ మూవీలో నటించింది. నికేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు విష్ణు విశాల్- రామ్ కుమార్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో లీడ్ రోల్ పోషించనుంది. ఇప్పుడు తెలుగులో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ బ్యూటీ సౌత్ లో బిజీగా మారనుందన్నమాట.

ప్రస్తుతం టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న హీరోయిన్లు.. భాషతో సంబంధం లేకుండా రానిస్తున్నారు. బడా డైరెక్టర్ల ప్రాజెక్టుల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. స్టార్ హీరోలతో ఆడిపాడుతున్నారు. ఇప్పటికే కేరళ బ్యూటీలు కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏదేమైనా అమ్మడు రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త జాగ్రత్తగా కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటే మరో సాయి పల్లవి తరహాలో క్రేజ్ పెంచుకుంటుంది అని చెప్పవచ్చు. మరి మమిత.. సౌత్ తోపాటు టాలీవుడ్ లో ఎలాంటి ఆఫర్లు అందిపుచ్చుకుంటుందో చూడాలి.