Begin typing your search above and press return to search.

ప్రేమలు పాప.. మళ్ళీ మాయ చేస్తోందిగా..

తాజాగా మమిత డ్యాన్స్ వీడియో.. చక్కర్లు కొడుతోంది. ఓ ఈవెంట్ లో ఆమె ఇంగ్లీష్ మ్యూజిక్ కు తన స్టెప్పులతో అదరగొట్టింది. ఎక్స్ప్రెషన్స్ తో ఫిదా చేస్తోంది.

By:  Tupaki Desk   |   14 March 2024 9:04 AM GMT
ప్రేమలు పాప.. మళ్ళీ మాయ చేస్తోందిగా..
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మలయాళీ కుట్టీలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. వారు తెలుగు చిత్రాల్లో నటించకపోయినా.. మాలీవుడ్ డబ్బింగ్ మూవీలతోనే ఇక్కడ మంచి పేరు దక్కించుకున్నారు. అలాంటి వారిలో మమితా బైజు ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. నెట్టింట ఈ అమ్మడు గురించి తెగ వెతికేస్తున్నారు.

తాజాగా విడుదలైన ప్రేమలు మూవీతో మహితా బైజు.. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. గత నెలలో మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ.. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మూవీలో మమిత క్యూట్ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ తోపాటు గ్లామర్ కు టాలీవుడ్ లవర్స్ అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈమెకు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఇక సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా మమిత పేరు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటోంది. కొత్త క్రష్ అంటూ మమిత ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆమె పిక్స్ తోపాటు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మమిత డ్యాన్స్ వీడియో.. చక్కర్లు కొడుతోంది. ఓ ఈవెంట్ లో ఆమె ఇంగ్లీష్ మ్యూజిక్ కు తన స్టెప్పులతో అదరగొట్టింది. ఎక్స్ప్రెషన్స్ తో ఫిదా చేస్తోంది. ఎల్లో- గ్రీన్ కలర్ శారీలో గ్లామరస్ గా కనిపిస్తోంది.

మమితా బైజుకు ప్రేమలు ఫస్ట్ మూవీ కాదు. దీని కన్నా ముందు చాలా సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమాకు రాని గుర్తింపు.. ప్రేమలు తెచ్చిపెట్టింది. దీంతో తెలుగులో ఈమె ఫాలోయింగ్ పెరిగిపోయింది. తెలుగులో తనకు వచ్చిన ఫేమ్ ను చూసి ఇటీవల ఓ ఈవెంట్ లో ఫుల్ ఎమోషనల్ అయింది మమిత. మొత్తానికి ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు అయినా ఇప్పుడు ప్రేమలు సినిమాతో స్టార్ గా మారిపోయింది మమిత.

కొట్టాయం ప్రాంతానికి చెందిన మమితా బైజు.. డాక్టర్స్ కుటుంబంలో పుట్టి, చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సైకాలజీలో డిగ్రీ చేస్తోంది. మరి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో మమిత ఎప్పుడు నటిస్తుందో చూడాలి. ఆమె ఫ్యాన్స్ త్వరగా టాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏ టాలీవుడ్ డైరెక్టర్ మమితా బైజుకు తెలుగులో అవకాశం ఇస్తారో చూడాలి మరి.