Begin typing your search above and press return to search.

ప్రేమలు భామ వెంట పడుతున్న నిర్మాతలు..!

సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగు ఆడియన్స్ కు ఏ హీరోయిన్ అయినా నచ్చేస్తే ఆమెను ఒక రేంజ్ కు లేపుతారు

By:  Tupaki Desk   |   21 March 2024 4:57 AM GMT
ప్రేమలు భామ వెంట పడుతున్న నిర్మాతలు..!
X

మలయాళంలో సూపర్ హిట్టైన ప్రేమలు సినిమా తెలుగులో కూడా యూత్ ఆడియన్స్ ను అలరిస్తుంది. సినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు లో రిలీజ్ చేసేసరికి ఎక్కువ రీచింగ్ వచ్చింది. తెలుగు యువత అంతా కూడా ప్రేమలు హీరోయిన్ మమితా బైజుతో ప్రేమలో పడిపోతున్నారు. ప్రేమలు మలయాళంలో బ్లాక్ బస్టర్ కాగా తెలుగులో కూడా ఆ సినిమా బాగానే సందడి చేసింది. ఈ సినిమాలో నటించిన మమితా బైజుకి అయితే ఇక్కడ సూపర్ పాపులారిటీ వచ్చింది.

సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగు ఆడియన్స్ కు ఏ హీరోయిన్ అయినా నచ్చేస్తే ఆమెను ఒక రేంజ్ కు లేపుతారు. ప్రేమలు రిలీజ్ అయినప్పటి నుంచి మమితా బైజు ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రేమలు చూసిన తర్వాత అమ్మడికి తెలుగులో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో విష్ణు విశాల్ తో ఒక సినిమా లాక్ చేసుకున్న మమితా తెలుగులో టైర్ 2 హీరో సినిమా కోసం సంప్రదించారని తెలుస్తుంది.

అంతేకాదు తెలుగు మేకర్స్ అంతా కూడా మమితా బైజు వెంట పడుతున్నారని తెలుస్తుంది. 2017 లో మలయాళ సినిమా సర్వోపారి పలక్కరన్ సినిమాతో తెరంగేట్రం చేసిన మమితా బైజు వరుస సినిమాల్లో తన టాలెంట్ చూపిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రేమలు సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన మమితా టాలెంట్ మన ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ లేటెస్ట్ క్రష్ మమితా బైజు అని చెప్పుకుంటున్నారు.

సో టాలీవుడ్ లో మమితాకు ఏర్పడిన ఈ క్రేజ్ ఆమెకు వరుస అవకాశాలు తెప్పిస్తాయని చెప్పొచ్చు. మమితా బైజు కూడా తెలుగులో మంచి ఆఫర్లు వస్తే చేయాలని ఆసక్తిగా ఉంది. సో ప్రస్తుతం ఫాం లో ఉన్న హీరోయిన్స్ కి మమితా బైజు కూడా రూపంలో ఒక షాక్ తగలక తప్పేలా లేదు. మరి మమితా ఫస్ట్ తెలుగు ప్రాజెక్ట్ ఏది అవుతుంది అన్నది చూడాలి. కాస్త టాలెంట్ చూపిస్తే చాలు హృదయాల్లో హీరోయిన్స్ కు స్థానం కల్పిస్తారు తెలుగు ఆడియన్స్. ప్రేమలు సినిమాలో మమితా బైజుకి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ఇచ్చారు. కచ్చితంగా అమ్మడు తెలుగులో మరిన్ని సినిమాలతో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ కలుగచేస్తుందని చెప్పొచ్చు.