Begin typing your search above and press return to search.

ప్రేమలు బ్యూటీకి మరో బంపర్ ఆఫర్..!

తెలుగులో ఎప్పటి నుంచో నటించాలని ఉన్నా సరైన కథ దొరక్క సైలెంట్ గా ఉంది మమితా బైజు.

By:  Tupaki Desk   |   11 May 2025 9:30 AM
ప్రేమలు బ్యూటీకి మరో బంపర్ ఆఫర్..!
X

మలయాళ భామ మమితా బైజు ప్రేమలు సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ ని తెచ్చుకుంది. ప్రేమలు ఒక రెగ్యులర్ లవ్ స్టోరీనే కానీ అందులో నటించిన మమితా తన క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ తో యువత హృదయాలను దోచేసింది. ప్రేమలు బ్యూటీకి వచ్చిన ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో మమితా బైజుకి ఉన్న ఫ్యాన్స్ దృష్టిలో ఉంచుకుని ఆమెను ఇక్కడ సినిమాల్లో తీసుకోవాలని చూస్తున్నారు.

ఇప్పటికే మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో మమితా నటిస్తుందని తెలుస్తుంది. కిశోర్ తిరుమల డైరెక్షన్ లో చేస్తున్న అనార్కలి సినిమాలో మమితా బైజు నటిస్తుందని టాక్. ఈ సినిమాలో కయదు లోహార్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని చెబుతున్నారు. ఐతే ఈ సినిమాతో పాటుగా మమితా టాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ అందుకుందని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగులో ఒక క్రేజీ సినిమాలో హీరోయిన్ గా మమితాని ఓకే చేశారట.

క్రేజీ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. మమితా కూడా స్టోరీ వినగానే కనెక్ట్ అయ్యిందట. తెలుగులో ఎప్పటి నుంచో నటించాలని ఉన్నా సరైన కథ దొరక్క సైలెంట్ గా ఉంది మమితా బైజు. ఐతే ఇప్పుడు అమ్మడు వరుస తెలుగు సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది. రవితేజ సినిమాలో మంచి రోల్ చేస్తుందని తెలుస్తుండగా ఈ సినిమాతో పాటు మరో కొత్త సినిమాకు లాక్ అయినట్టు తెలుస్తుంది.

స్క్రీన్ మీద మమితా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కుర్రాళ్లను గిలిగింతలు పెట్టిస్తుంది. అందుకే యూత్ లో ఆమెకు ఉన్న ఈ క్రేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలని చూస్తున్నారు. మమితా బైజు తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళ సినిమాల్లో రాణిస్తుంది. ప్రస్తుతం అమ్మడు దళపతి విజయ్ జన నాయగన్ లో కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ఆ సినిమాలో పూజా హెగ్దే కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంటున్న మమితా తెలుగులో బిజీ హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకోవాలని చూస్తుంది. ప్రేమలుతో ఆల్రెడీ మమితాకు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. సో రాబోయే సినిమాలు కూడా ఆమె అదరగొట్టేస్తుందని ఫిక్స్ అయ్యారు.