Begin typing your search above and press return to search.

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ప్రేమలు పాప!

మలయాళ బ్యూటీ మమిత బైజు ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ సంపాదించిన ఈ అమ్మడు, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

By:  Tupaki Desk   |   18 May 2025 9:00 PM IST
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ప్రేమలు పాప!
X

మలయాళ బ్యూటీ మమిత బైజు ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ సంపాదించిన ఈ అమ్మడు, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఆమె అందం, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఆమె తమిళ స్టార్ హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మమిత బైజు కెరీర్ గ్రాఫ్ గత రెండేళ్లలో రాకెట్ స్పీడ్‌లో ఎగబాకింది. ‘ప్రేమలు’ సినిమాతో యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించిన ఆమె, ఆ తర్వాత విష్ణు విశాల్ సరసన ‘ఇరందు వానం’ లో అందుకుంది. లేటెస్ట్ గా తమిళ స్టార్ జీవీ ప్రకాష్‌తో ‘రెబెల్’ సినిమాలతో కోలీవుడ్‌లో సత్తా చాటింది. ఇటీవల విజయ్ సరసన ‘జననాయకన్’ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి, ఇప్పుడు సూర్యతో సినిమాతో మరో మెట్టు ఎక్కుతుందని అంటున్నారు.

సూర్య ప్రస్తుతం ‘రెట్రో’ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తమిళంలో మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. అలాగే సూర్య ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. RJ బాలాజీ డైరెక్షన్‌లో ‘సూర్య 45’ షూటింగ్‌లో ఉండగా, తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్‌గా మమిత బైజు ఎంపికైందని తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 19 రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. మమిత బైజు ఈ అవకాశాన్ని అందుకోవడం ఆమె కెరీర్‌లో మరో రికార్డ్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.

వెంకీ అట్లూరి సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఆయన స్టైలిష్ డైరెక్షన్, ఎమోషనల్ డ్రామాతో సూర్య, మమితలను ఎలా చూపిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, షూటింగ్ మొదలయ్యేలోపే పాటల కంపోజిషన్ పూర్తి చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా సూర్య 46గా సినిమాగా రూపొందుతోంది.