52 ఏళ్ల నటుడికి కుమార్తె..51 ఏళ్ల హీరోకి ప్రియురాలు!
చిత్రంలో సూర్య, మమిత బైజుల మధ్య వయసు వ్యత్యాసంతో కూడిన ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం.
By: Srikanth Kontham | 27 July 2026 12:24 PM ISTమాలీవుడ్ బ్యూటీ మమిత బైజు జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అనతి కాలంలోనే అమ్మడు నటిగా సక్సెస్ అయింది. యువతలోనే క్రేజీ బ్యూటీగా పాపులర్ అయింది. దీంతో సౌత్ లో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగు సినిమాలు చేయకపోయినా? ఇక్కడా అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే అమ్మడి జర్నీ తాజాగా ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఇటీవలే మమిత నటించిన `జననాయగన్` ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ కుమార్తె పాత్రలో నటించింది. అయితే సినిమాలో మమిత బైజు పాత్రకు సరైన రైటింగ్ దక్కకపోవడం.. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించకపోవడం కొంత నిరాశను మిగిల్చింది.
`భగవంత్ కేసరి` చిత్రంలో శ్రీలీల పాత్రతో పోలిస్తే ఈ పాత్ర బలహీనంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. విజయ్ లాంటి స్టార్ హీరో చిత్రంలో నటించినా? ఆమె నటనకు తగినంత ప్రాధాన్యత దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ నిరాశ నుంచి అమ్మడు తెరుకుంటుంది. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే? 51 ఏళ్ల వయసున్న సూర్య సరసన ప్రేయసిగా (రొమాంటిక్ జోడీగా) నటిస్తుండటం.
చిత్రంలో సూర్య, మమిత బైజుల మధ్య వయసు వ్యత్యాసంతో కూడిన ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. అయితే విజయ్ కుమార్తెగా నటించిన నటి సూర్యకు లవర్ గా నటించడమే ఆసక్తికరం. ఓ సారి వీరి వయసులు చూస్తే? విజయ్ కు 52 ఏళ్లు కాగా మమితా బైజుకు 25 ఏళ్లు. కాబట్టి కుమార్తె పాత్రకు సరిపోతుంది. కానీ సూర్య కి 51 ఏళ్లు. కానీ ప్రియారాలి పాత్రకు సెట్ అవ్వడమే? ఆసక్తికరం. అయితే ఈ సినిమా స్టోరీ వయసు వ్యత్యాసం నేపథ్యంలో సాగే కథ కావడంతో? ఆ పాత్రకు సెట్ అవుతుంది.
మరి ఆ రోల్ ఎలా ఉంటుంది? దర్శకుడు ఎంత కన్విన్సింగ్ గా చెబుతాడు? అన్నది చూడాలి. అందులో ఎక్కడా తేడా వచ్చినా మళ్లీ విమర్శలు తప్పవు. ఇది మమితా బైజుకు మరింత నెగిటివ్ గా మారుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే హీరో-హీరోయిన్ మధ్య వయసు బ్యాలెన్స్ కాకపోతే తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నిందలు పడాల్సి వస్తోంది. `ధురంధర్` సినిమాలో రణవీర్ సింగ్-సారా అర్జున్ ఇలాంటి విమర్శలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే.
