మామితాతో లవ్ స్టోరీ కావాలంటున్న ఫ్యాన్స్..!
కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తే క్రేజ్ రాదా అంటే వస్తుంది కానీ అది సరైన పాత్ర పడినప్పుడు మాత్రమే అలా కుదురుతుంది.
By: Tupaki Desk | 13 Jun 2025 10:00 AM ISTప్రేమలు సినిమాతో యూత్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది మలయాళ భామ మమితా బైజు. అంతకున్ముందు ఐదారేళ్లుగా సినిమాలు చేస్తున్నా కూడా ప్రేమలుతో అమ్మడి టాలెంట్ సౌత్ ఆడియన్స్ కి నచ్చేసింది. యూత్ ఆడియన్స్ అయితే మమితా పేరు వింటే చాలు ఊగిపోతున్నారు. ప్రేమలు తెలుగులో కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. ఐతే ప్రేమలు తర్వాత అమ్మడు కోలీవుడ్ లో ఆల్రెడీ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే రెడు సినిమాలు చేసింది మరో రెండు సినిమాలు సైన్ చేసింది.
తెలుగులో మైత్రి మేకర్స్ చేస్తున్న డ్యూడ్ లో ప్రదీప్ రంగనాథ్ తో జత కడుతుంది మమితా. ఐతే లేటెస్ట్ గా సూర్య వెంకీ అట్లూరి సినిమాలో కూడా అమ్మడు అవకాశం దక్కించుకుంది. ఐతే మమితాకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ తెలుసు కాబట్టి ఆమెను యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ లో తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మమితాతో వెరైటీ లవ్ స్టోరీస్ చేస్తే చూడాలని కోరుతున్నారు. అది కాకుండా ఆమె కమర్షియల్ సినిమాల్లో నటిస్తే అంతగా స్కోప్ దొరకదని వాళ్ల ఆలోచన.
ఒక విధంగా అది నిజమే అని చెప్పొచ్చు. మమితా లాంటి టాలెంట్ క్యూట్ హీరోయిన్ తో డిఫరెంట్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఆమెకు స్టార్ సినిమాల్లో కేవలం పాటల వరకు వచ్చి వెళ్లే హీరోయిన్ లా తీసుకుంటే మాత్రం తప్పకుండా రివర్స్ లో రిజల్ట్ ఉంటుంది. మమితాను ఆడియన్స్ ఒక లవ్ స్టోరీ హీరోయిన్ గా చూడాలని ఆసక్తిగా ఉన్నారు. అందుకే అలాంటి కథలకే ఆమెను తీసుకుంటే బెటర్ అంటున్నారు.
కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తే క్రేజ్ రాదా అంటే వస్తుంది కానీ అది సరైన పాత్ర పడినప్పుడు మాత్రమే అలా కుదురుతుంది. అలా కాకుండా కేవలం పాటల వరకే హీరోయిన్ అనేలా ఉంటే మాత్రం మైతా వల్ల సినిమాకు ప్లస్ అవ్వడం అటుంచితే మైనస్ అవుతుంది. ఈ విషయంలో మమితా కూడా ఆడియన్స్ లో తనకున్న ఫాలోయింగ్ గుర్తించి సినిమాలు ఎంపిక చేసుకుంటే బెటర్ అని అంటున్నారు. సూర్య తో చేస్తున్న సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో కానీ ప్రదీ తో చేస్తున్న డ్యూడ్ లో యూత్ ఆడియన్స్ కి మరోసార్ కిక్ ఇచ్చే రోల్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
