Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో మరో కొత్త సెంటిమెంట్… ఆ హీరోయిన్ ఏడిస్తే బ్లాక్‌బ‌స్ట‌ర్ గ్యారెంటీ!

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ చేసిన కామెంట్స్ ఈ డిస్క‌ష‌న్‌కు కారణమయ్యాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Aug 2026 2:27 PM IST
ఇండస్ట్రీలో మరో కొత్త సెంటిమెంట్… ఆ హీరోయిన్ ఏడిస్తే బ్లాక్‌బ‌స్ట‌ర్ గ్యారెంటీ!
X

టాలీవుడ్ లో సెంటిమెంట్లు కొత్త విషయం కాదు. ఒక హీరోకు ఓ ప్రత్యేకమైన రిలీజ్ డేట్ కలిసొస్తుందని, ఒక డైరెక్ట‌ర్ కు ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతాయని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తుందని తరచూ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మరో కొత్త సెంటిమెంట్ ఇండస్ట్రీలో డిస్క‌ష‌న్ కు దారి తీస్తోంది. అది హీరోయిన్ మమిత బైజు చుట్టూ తిరుగుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ చేసిన కామెంట్స్ ఈ డిస్క‌ష‌న్‌కు కారణమయ్యాయి. మమిత ఏ సినిమాలో ఏడ్చినా ఆమెతో పాటు ఆడియ‌న్స్ కూడా ఎమోషనల్ అవుతారని, ఆ కనెక్షన్ సినిమాను బ్లాక్‌బస్టర్ దిశగా తీసుకెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్‌లో ఆమె సూర్యను కూడా ఏడిపించే ఎమోషనల్ సీన్స్ కనిపిస్తున్నాయని, అందుకే ఈ సినిమా డబుల్ బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆయ‌న జోస్యం చెప్పారు.

ఈ కామెంట్స్ కేవలం ఒక నిర్మాత ప్రశంసలుగా మాత్రమే కాకుండా, ఒక హీరోయిన్ కు ఏర్పడుతున్న ఎమోషనల్ ఇమేజ్‌గా కూడా చూడొచ్చు. సాధారణంగా హీరోల చుట్టూ ఏర్పడే హిట్ సెంటిమెంట్లు ఇప్పుడు ఒక హీరోయిన్ యాక్టింగ్ చుట్టూ ఏర్పడటం ఆసక్తికర పరిణామంగా మారింది. మమిత బైజు అన‌గానే ఆడియ‌న్స్ కు గుర్తొచ్చేది ఆమె నేచుర‌ల్ యాక్టింగ్. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్ లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఆడియ‌న్స్ ను క‌ట్టిప‌డేస్తాయ‌నే అభిప్రాయం ముందు నుంచే ఉంది. ప్రేమలు సినిమా తర్వాత ఆమెకు వచ్చిన గుర్తింపు కేవలం యూత్ ఫాలోయింగ్‌కే పరిమితం కాలేదు, నటిగా కూడా ఆమెపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు విశ్వనాథ్ & సన్స్‌లో ఆమె చేస్తున్న ఎమోషనల్ క్యారెక్ట‌ర్ ఆ అంచనాలను మరింత పెంచుతోంది.

సినీ ఇండ‌స్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్లు చాలా సార్లు ఒక సినిమా రిలీజ్‌కు ముందే పుడతాయి. ఒక ట్రైలర్, ఒక సీన్ లేదా ఒక పెర్ఫార్మెన్స్ చుట్టూ పాజిటివ్ టాక్ ఏర్పడితే అది ఆడియ‌న్స్ అంచనాలను ప్రభావితం చేస్తుంది. అదే ఇప్పుడు మమిత విషయంలో జరుగుతోందనే విశ్లేషణ వినిపిస్తోంది. వాస్తవానికి బాక్సాఫీస్ రిజ‌ల్ట్ ను సెంటిమెంట్లు డిసైడ్ చేయ‌లేక‌పోయినా, ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అంచనాను మాత్రం క్రియేట్ చేస్తాయి. ఆ అంచనాలను మమిత తన యాక్టింగ్ తో అందుకుంటుందా లేదా అనేది ఆగస్టు 14న రిలీజ్ కానున్న విడుదల కానున్న విశ్వనాథ్ & సన్స్ సినిమాతో తేలనుంది.