Begin typing your search above and press return to search.

మామా మశ్చీంద్ర.. టార్గెట్ ఫిక్స్ చేసుకున్న సుధీర్ బాబు

ఈ సినిమా అక్టోబర్ 6 న థియేటర్లలోకి రానున్నట్లు ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సుధీర్ బాబు డాన్‌గా, లావుగా, డీజేగా మూడు పాత్రలలో కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Sep 2023 3:02 PM GMT
మామా మశ్చీంద్ర.. టార్గెట్ ఫిక్స్ చేసుకున్న సుధీర్ బాబు
X

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఘట్టమనేని అల్లుడు సుదీర్ బాబు రాబోయే రోజుల్లో మరిన్ని డిఫరెంట్ సినిమాలను కూడా వెండితెరపైకి తీసుకురాబోతున్నాడు. గతంలో ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేసుకుంటూ వచ్చిన సుదీర్ బాబు ఈ మూడేళ్ల కాలంలో అయితే ఏడాదికి ఒక్క సినిమాను చేసుకుంటూ వచ్చాడు.


అయితే ఈసారి మాత్రం అతని లైనప్ లో మూడు సినిమాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొదట్లో హంట్ అనే సినిమాతో వచ్చిన సుధీర్ సక్సెస్ కోసం బాగానే హార్డ్ వర్క్ చేశాడు. కానీ దాంతో అంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు అతను మామా మశ్చీంద్ర అనే సినిమాతో రాబోతున్నాడు.

టైటిల్ తోనే విభిన్నంగా ఆకట్టుకున్న సుధీర్ బాబు ఇందులో మూడు విభిన్నమైన పాత్రలతో కనిపించబోతున్నాడు. ఇప్పటికే కొన్ని పోస్టర్స్ విడుదల చేసి మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాకు నటుడు-చిత్రనిర్మాత హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన మామా మశ్చీంద్ర విడుదల డేట్ లాక్ చేశారు.

ఈ సినిమా అక్టోబర్ 6 న థియేటర్లలోకి రానున్నట్లు ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సుధీర్ బాబు డాన్‌గా, లావుగా, డీజేగా మూడు పాత్రలలో కనిపిస్తున్నారు. అన్ని ప్రముఖ పాత్రలను పరిచయం చేసిన టీజర్ కు సినిమా పోస్టర్లకు ల్ మంచి స్పందన లభించింది. ఇందులో మొదటి సింగిల్ గాలుల్లోన సంగీత ప్రియులు పరవాలేదు అనిపించింది.

ఇక విడుదల తేదీని లాక్ చేసినందున, మేకర్స్ రాబోయే కొద్ది రోజుల్లో ప్రమోషన్ డోస్ కూడా పెంచనున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలో మిర్నాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించారు. పిజి విందా సినిమాటోగ్రఫీని నిర్వహించగా, రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌కి చెందిన సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు.