Begin typing your search above and press return to search.

మామా మశ్చీంద్ర.. ఈ వెరైటీ ప్రీమియర్స్ వర్కౌట్ అవుతుందా?

మరో రోజులో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర రిలీజ్ కానుంది. దీంతో మూవీటీమ్.. ప్రీమియర్ల కోసం ఓ వినూత్న ప్లాన్ చేసింది

By:  Tupaki Desk   |   5 Oct 2023 6:53 AM GMT
మామా మశ్చీంద్ర.. ఈ వెరైటీ ప్రీమియర్స్ వర్కౌట్ అవుతుందా?
X

మరో రోజులో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర రిలీజ్ కానుంది. దీంతో మూవీటీమ్.. ప్రీమియర్ల కోసం ఓ వినూత్న ప్లాన్ చేసింది. ఇండియన్ సినిమాలోనే ఇలా చేయడం తొలిసారని చెబుతున్నారు.


ఈ సినిమా విడుదల ముందు రోజు.. అంటే నేడు(సెప్టెంబర్ 5) రాత్రి ఏఎంబీ మల్టీప్లెక్స్​లో స్పెషల్ షో వేశారు. సినిమా ప్రదర్శితం అవుతున్న రెండున్నర గంటల పాటు ఆడియెన్స్ లైవ్ రియాక్షన్లను రికార్డు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ డిఫరెంట్ ప్రమోషన్ బాగానే ఉంది కానీ.. ప్రాక్టికల్​గా కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కెమెరాలు తమని గమనిస్తున్నాయని తెలిస్తే.. ప్రేక్షకుల స్వేచ్ఛ సహజంగానే కాస్త తగ్గుతుంది.


ఓ పది ఇరవై నిమిషాలు అంటే ఓకే కానీ.. మరీ రెండున్నార గంటల పాటు సినిమా మొత్తం వాళ్ళ హావభావాలు చూపించడమంటే చాలెంజ్ అనే చెప్పాలి. అప్పటికీ సినిమా చూసేవాళ్లకు కెమెరాల గురించి ముందే చెప్పి కాస్త ప్రిపేర్ చేసి ఉండొచ్చు. కానీ లైవ్​కు బదులు.. అంతా అయ్యాక.. ఎడిట్ చేసి మెయిన్ వాటిని ప్రమోషన్లలో వాడుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి.

సరే ఏదేమైనప్పటికీ... షోకు సంబంధించిన కొన్ని ఫొటోలు విడుదల చేశారు. మరి విటి హడావుడి ఏమైనా ఉంటుందో లేదో చూడాలి. పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓపెనింగ్స్ రావాలంటే ఏదో ఒక కొత్త స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. అందుకే మామా మశ్చీంద్ర టీమ్.. ఇలా వినూత్నంగా ప్లాన్ చేసింది. చూడాలి మరి ఫలితం ఎలా ఉంటుందో..ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే తర్వాత మిగిలిన మూవీటీమ్స్ కూడా వీటిని ఫాలో అవ్వొచ్చు.

కాగా, నటుడు, రచయిత హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేశారు. నెగటివ్ టచ్ ఉన్న వృద్ధుడిగా, భారీకాయుడిగా, డీజేగా ఇలా మూడు రూపాల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికైతే విడుదలైన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. రూల్స్ రంజన్, మంత్ అఫ్ మధు, మ్యాడ్, 800 సినిమాలు.. మామా మశ్చీంద్రకు పోటీగా రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిలో మామా మశ్చీంద్రకు మంచి టాక్ వస్తే.. దసరా వరకు మంచి వసూళ్లను అందుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.