Begin typing your search above and press return to search.

ఎవ‌రు ఈ బ్లాక్ అండ్ బ్లాక్ లేడీ

మాల్వీ వ్య‌క్తిగ‌త జీవితంలోని నిజ‌క‌థ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. 2020లో వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకు మాల్వీని ఒక వ్య‌క్తి కత్తితో పొడిచాడు.

By:  Tupaki Desk   |   25 July 2025 8:26 AM IST
ఎవ‌రు ఈ బ్లాక్ అండ్ బ్లాక్ లేడీ
X

ఎన్బీకే, రాజ్ త‌రుణ్‌ల చిత్రంలో న‌టించింది మాల్వీ మ‌ల్హోత్రా. ఈ ఉత్త‌రాది బ్యూటీ అంద‌చందాలు, న‌ట ప్ర‌తిభ‌కు అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపించారు. మాల్వీ నిరంత‌ర ఫోటోషూట్ల‌తోను అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంది. ఈ బ్యూటీ తాజా ఫోటోషూట్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో గుబులు రేపుతోంది. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో మాల్వీ హృద‌యాల‌ను కొల్ల‌గొడుతోంది. బ్లాక్ ఫ్రాక్ లో మాల్వీ యూనిక్ గా క‌నిపిస్తోందంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

మాల్వీ వ్య‌క్తిగ‌త జీవితంలోని నిజ‌క‌థ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. 2020లో వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకు మాల్వీని ఒక వ్య‌క్తి కత్తితో పొడిచాడు. గత వారం ముంబైలోని సెషన్స్ కోర్టు నేరస్థుడిని దోషిగా నిర్ధారించి మూడు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించింది. మాల్వి ఆ సంఘటన గురించి ఒక విషాదకరమైన పీడకలలా మర్చిపోవాలనుకుంటున్నట్లు తెలిపింది. మహిళల భద్రత ప్రాముఖ్య‌త‌, కష్ట సమయాల్లో కుటుంబంలో మద్దతు పొందడం గురించి కూడా మాల్వీ మాట్లాడారు.

శారీరక గాయాల కంటే, నేను చాలా మానసిక గాయాలకు గురయ్యాను. మొదట్లో నేను చాలా భయపడేదానిని.. నన్ను ఎవరో అనుసరిస్తున్నట్లు అనిపించింది. నా కుటుంబం, ముఖ్యంగా నా తండ్రి, నాకు నయం కావడానికి మద్దతును, బలాన్ని ఇచ్చారు. వారు తమ ఉద్యోగాన్ని కూడా వదిలి నాతో సమయం గడిపారు. అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి డబ్బు సంపాదించడానికి ప‌నిలో మునిగిపోయాను.. అని తెలిపింది.