Begin typing your search above and press return to search.

శ్రీముఖితో క్లోజ్ గా మంచు మనోజ్.. ఆళ్లగడ్డ నుంచి బాంబులు పడతాయంటూ..!

ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సుమ తనయుడు రోషన్ కూడా తన సినిమా ప్రమోషన్ కోసం ఈ షోకి వచ్చినట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 10:35 AM GMT
శ్రీముఖితో క్లోజ్ గా మంచు మనోజ్.. ఆళ్లగడ్డ నుంచి బాంబులు పడతాయంటూ..!
X

పండుగ వచ్చింది అంటే ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ సెలబ్రిటీస్ తో మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తారు. అందులో ముఖ్యంగా ఈటీవీ అయితే ప్రతి పండుగకి ఒక మంచి షో ప్లాన్ చేస్తుంది. ఆ షోలో అటు జబర్దస్త్ టీం ని ఇటు ఢీ వాళ్లని అందరినీ వాడేస్తుంటారు. ఇక ఈ ఫెస్టివల్ షోకి ఎవరో ఒక స్టార్ గెస్ట్ గా కూడా వస్తారు. దీపావళి కానుకగా బుల్లితెర ప్రేక్షకుల కోసం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ ఒక షో ప్లాన్ చేశారు. ఈ షోకి యాంకర్స్ గా సుమ, శ్రీముఖి వ్యవహరిస్తున్నారు.

ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సుమ తనయుడు రోషన్ కూడా తన సినిమా ప్రమోషన్ కోసం ఈ షోకి వచ్చినట్టు తెలుస్తుంది. తనకు శంకరాభరణం, అర్జున్ రెడ్డి రెండు సినిమాలు ఇష్టమే అని సుమ అన్నారు. ఇంతలో ఆది మీ అబ్బాయి శంకరాభరణమా లేదా అర్జున్ రెడ్డా అంటే అర్జున్ రెడ్డి అని నవ్వారు. ఇక ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా మంచు మనోజ్ అటెండ్ అయ్యారు.

వచ్చీ రాగానే శ్రీముఖి మనోజ్ తో ఇంగ్లీష్ లో మాట్లాడటానికి వెరైటీగా ప్రయత్నించింది కానీ అది తప్పని చెప్పి స్పెల్ మిస్టేక్ సరిచేయాలని ప్రయత్నిస్తాడు మంచు మనోజ్. ఇక శ్రీముఖి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే తన దగ్గరకు రావాలని అం శ్రీముఖి వచ్చి మంచు మనోజ్ చేయి పట్టుకోగా వారికి లవ్ సింబల్ వేసి దేవత నా దేవటాడు. అప్పుడుత సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వదులుతారు. అప్పుడు మంచు మనోజ్, శ్రీముఖి వద్దని వారించారు.

అంతేకాదు మంచు మనోజ్ ఆళ్లగడ్డ నుంచి బాంబులు పడతాయి అంటూ నవ్వారు. మొత్తానికి ఈ దీపావళి పండుగ రోజు ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసేందుకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రెడీ అవుతుంది. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అంటూ ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ షో డిజై చేశారు. మంచు మనోజ్ చాలా కాలం తర్వాత అటెండ్ అయిన షో కాబట్టి ఈ షో తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు.