Begin typing your search above and press return to search.

మ‌ల్లికా శ‌రావ‌త్ బ్యాక్‌లెస్ ట్రీట్

అయితే కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న క్ర‌మంలో త‌న బోయ్ ఫ్రెండ్ తో క‌లిసి విదేశాల‌కు వెళ్లిపోయింది.

By:  Tupaki Desk   |   8 July 2024 3:30 PM GMT
మ‌ల్లికా శ‌రావ‌త్ బ్యాక్‌లెస్ ట్రీట్
X

బోల్డ్ బ్యూటీ మ‌ల్లికా శ‌రావ‌త్ ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంది. య‌ష్ రాజ్ ఫిలింస్ లో మ‌ర్డ‌ర్ లాంటి బోల్డ్ మూవీలో న‌టించింది. ఈ సినిమాలో ఇమ్రాన్ హ‌స్మీతో పెద‌వి ముద్దులు బెడ్ రూమ్ రొమాన్స్ లో చెల‌రేగిపోయింది. ఆ ఒక్క సినిమా మ‌ల్లిక రేంజును ఆకాశం ఎత్తుకు తీసుకెళ్లింది. దేశ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. బాలీవుడ్ లో కొన్ని హాటెస్ట్ మూవీస్ లో న‌టించిన మ‌ల్లిక హాట్ ఐట‌మ్ నంబ‌ర్ల‌లోను న‌ర్తించి మెప్పించింది. 'హిస్' లాంటి హాలీవుడ్ సినిమాలోను న‌టించింది. అయితే కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న క్ర‌మంలో త‌న బోయ్ ఫ్రెండ్ తో క‌లిసి విదేశాల‌కు వెళ్లిపోయింది.


కానీ ఆ త‌ర్వాత అత‌డితో బ్రేక‌ప్ అయ్యాక తిరిగి ఇండియాలో అడుగుపెట్టింది. ఇక్క‌డ బాలీవుడ్ లో తిరిగి న‌టించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మ‌ల్లిక కొన్ని సినిమాల‌కు సంత‌కాలు కూడా చేసింది. ఆర్‌.కే అనే థ్రిల్ల‌ర్ చిత్రంలోను మ‌ల్లిక న‌ట‌న‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుదలైన‌ పామ్ బ‌ట్ట‌మ్ అనే చిత్రంలో మ‌ల్లిక వేడెక్కించే న‌ట‌న‌తో మైమ‌రిపించింది. కానీ ఆ సినిమా ఎందుక‌నో ఆశించిన విజ‌యంస సాధించ‌లేదు.


అయినా నిరాశ చెంద‌క మ‌ల్లిక త‌న‌వంతు ప్ర‌య‌త్నాలను ఆప‌లేదు. ప్ర‌స్తుతం హిందీ చిత్ర‌సీమ స‌హా సౌత్ లోను న‌టించేందుకు ఉత్సాహం ప్ర‌దర్శిస్తోంది. మ‌రోసారి సౌత్ లో త‌న ప్ర‌వేశం కోసం ప్ర‌య‌త్నాల‌ను ఆప‌డం లేద‌ని తెలిసింది. ఇంత‌లోనే మ‌ల్లిక హాట్ ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. మ‌ర్డ‌ర్ బ్యూటీ కిల్లింగ్ బ్యాక్ లెస్ వీడియో తాజాగా ఇన్ స్టాలో వైర‌ల్ గా మారుతోంది. ఈ వీడియోలో ప‌సుపు రంగు బికినీ ధ‌రించి బీచ్ ఫ్రంట్ మ‌ల్లిక చెల‌రేగిపోతోంది.


అప్పుడు వ‌య‌సులో ఉన్నాం: ఇమ్రాన్ హ‌ష్మి

తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో మ‌ల్లికా శెరావ‌త్ తో వివాదం గురించి ఇమ్రాన్ హష్మీ ఓపెన‌య్యారు. 2004 బ్లాక్‌బస్టర్ ఎరోటిక్ థ్రిల్లర్ `మర్డర్` విడుదలైన తర్వాత ఇద్దరి మధ్యా గొడ‌వ‌లు అయ‌యాయి. ఆ త‌ర్వాత ఇంత‌కాలానికి తిరిగి రాజీ అయ్యారు. పాపుల‌ర్ బాలీవుడ్ వెబ్ పోర్ట‌ల్ తో మాట్లాడుతూ ఇమ్రాన్ హ‌ష్మి... ఆ క‌ఠిన‌మైన స‌మ‌యాన్ని ఎలా అధిగ‌మించాడో వెల్ల‌డించాడు. ``అప్పట్లో మేం చిన్నవాళ్ళం... తెలివితక్కువవాళ్లం. మీ నిర్ణయాధికారం చాలా పరిమితం అయినప్పుడు మీరు మీ జీవితంలో ఒక దశకు వెళతారు. మీరు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు. కొన్ని నీచమైన విషయాలు దూరం చేస్తాయి. కానీ వాట‌న్నిటినీ మేం పక్కన పెట్టాము`` అని ఇమ్రాన్ అన్నాడు.


``ఇప్పుడు చాలా బాగా స్నేహంగా క‌లిసిపోయాం. చాలా కాలం తర్వాత నేను ఆమెను చూశాను. చాలా కాలంగా మేం క‌లుసుకోలేదు. మర్డర్ విడుదలైన తర్వాత నేను ఆమెను రెండుసార్లు మాత్ర‌మే కలిసాను!`` అని గుర్తు చేసుకున్నాడు ఇమ్రాన్. గత నెలలో జరిగిన అనంత్ పండిట్ కుమార్తె వివాహంలో ఈ ఇద్ద‌రూ జంట‌గా ఫోటోల‌కు ఫోజులిచ్చారు.

గ‌తంలోకి వెళితే... అనురాగ్ బ‌సుతో బ్రేకవుట్ హిట్ `మ‌ర్డ‌ర్` లో అద్భుతమైన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ఈ జంట‌ అభిమానులను ఆకర్షించారు. అయితే బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకోవడంతో వారి సంబంధం దెబ్బతింది. కానీ అది ప‌రిణ‌తి లేని వ‌య‌సు అని ఇమ్రాన్ అంటున్నారు. ప్ర‌స్తుతం ఇమ్రాన్ తదుపరి `షోటైమ్`లో కనిపించనున్నాడు. తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాన్ న‌టిస్తున్న ఓజీలోను కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.