మగాళ్లతో పని లేకుండా సుఖంగా ఉండగలను
ఇప్పుడు భారతీయ వివాహ వ్యవస్థను అవహేళనగా మాట్లాడింది. పెళ్లి తంతు గురించి విచిత్రమైన కామెంట్ చేసి అందరికీ షాకిచ్చింది.
By: Tupaki Desk | 22 July 2025 8:32 AM ISTఅవును.. మగాళ్లతో పని లేకుండా సుఖంగా ఉండగలనని చెప్పింది ప్రముఖ నటి. పెళ్లితో పని లేదు.. పెళ్లి ఉంగరాలతోను పనే లేదు! అన్నట్టుగా మాట్లాడింది మల్లిక. అయితే ఇది తన వ్యక్తిగత ఎంపిక అయినా కానీ ట్రోలర్ల భారిన పడింది ఈ హిస్.. బ్యూటీ.
మర్డర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కుర్రకారు హృదయాలను గెలుచుకున్న మల్లికా శెరావత్, ఆ తర్వాత బాలీవుడ్ ని ఒక దశాబ్ధం పాటు ఏలింది. ఘాటైన సన్నివేశాల్లో జీవించే కథానాయికగా మల్లికకు ప్రత్యేకమైన ఇమేజ్ దక్కింది. కానీ దానిని తుది కంటా నిలుపుకోవడంలో విఫలమైంది. హిస్ మూవీ తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరమైంది. వయసుతో పాటు, స్టార్ డమ్ ని కూడా కోల్పోయింది. ఇప్పుడు నటనలో కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్న ఈ లేటు వయసు ఘాటు సుందరిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే మల్లిక మీడియా ఇంటర్వ్యూల్లో హద్దులు చెరిపేసి అందరి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది.
ఇప్పుడు భారతీయ వివాహ వ్యవస్థను అవహేళనగా మాట్లాడింది. పెళ్లి తంతు గురించి విచిత్రమైన కామెంట్ చేసి అందరికీ షాకిచ్చింది. నెట్ ఫ్లిక్స్ కోసం హోస్ట్ ఐశ్వర్య మోహన్ రాజ్ తో మాట్లాడుతూ కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలు చేసింది మల్లిక. ఐశ్వర్య పెళ్లి రింగ్ ని చూపించమని అడిగి తన వేలికి ఉన్న ఖరీదైన ఉంగరాన్ని చూపించింది మలైకా. ఈ రెండూ ఒకటే అని పోలిక చెప్పింది. అంతేకాదు తాను మగాడితో పని లేకుండా ఆనందంగా జీవించగలనని కూడా వ్యాఖ్యానించింది. అయితే మల్లిక మాటలు విన్న సాంప్రదాయవాదులకు కోపం వచ్చింది. జోకులు అతిగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.
మగాళ్లతో పని లేదని వ్యాఖ్యానించినందున, స్త్రీ స్వాతంత్య్రాన్ని సహించలేని వారందరికీ మల్లిక శత్రువులా కనిపించింది. నిజానికి ఇది షో తాలూకా థీమ్.. అందుకే మల్లిక అలా మాట్లాడింది. అయితే ఈ విషయం తెలిసాక కూడా మల్లికను ట్రోల్ చేయాలనుకునే అమాయకత్వం బయటపడింది. సీతాదేవిలా సాంప్రదాయ బద్ధంగా మాట్లాడితే నెట్ ఫ్లిక్స్ షో ఎవరు చూస్తారు? గ్రాండ్ మస్తీలో ఊర్వశి రౌతేలా రేంజులో వేడెక్కిస్తేనే ఏదైనా షో క్లిక్కవుతుంది. ఇప్పుడు మల్లికా శెరావత్ అలాంటి ఒక షో కోసం ఇలా అదుపు తప్పి మాట్లాడింది.
