కాంటాలాగా గర్ల్ డెత్..నడి మధ్యలో భామల కొట్లాట
మల్లిక బొటాక్స్ గురించి, ఫిల్లర్ల గురించి ప్రస్థావిస్తూ, నేటి యూత్ కృత్రిమ పద్ధతుల్లో అందాన్ని పెంచుకోవాలని భావిస్తోందని, ఇది సరికాదని, సహజ సిద్ధంగానే అందాన్ని ఎలా పొందగలరో వివరిస్తూ వీడియోను పోస్ట్ చేసింది.
By: Tupaki Desk | 1 July 2025 5:00 PM ISTఅనురాగ్ బసు తెరకెక్కించిన `మర్డర్` చిత్రంతో మల్లికా శెరావత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఆ తర్వాత బాలీవుడ్ శృంగార నాయికగా ఓ వెలుగు వెలిగింది. ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి `హిస్` అనే చిత్రంలో నటించింది. శృంగార చిత్రాల కథానాయికగా మల్లికకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే `హిస్` మూవీ తర్వాత మల్లిక కొన్నేళ్ల పాటు విదేశీ ప్రియుడితో విదేశాల్లో సెటిలవ్వవడం అభిమానుల్ని చాలా నిరాశపరిచింది.
కట్ చేస్తే ఈ బ్యూటీ విదేశాల నుంచి ముంబైకి తిరిగి వచ్చింది. ఇక్కడ బాలీవుడ్ లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సినిమాలలో నటిస్తూ అభిమానులకు టచ్ లో ఉంది. మల్లిక సోషల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. ఇతర నటీమణుల్లానే నిరంతరం ఫోటోషూట్లు, వీడియో షూట్లను షేర్ చేస్తోంది. తాజాగా మల్లిక సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వివాదాస్పదమైంది.
మల్లిక బొటాక్స్ గురించి, ఫిల్లర్ల గురించి ప్రస్థావిస్తూ, నేటి యూత్ కృత్రిమ పద్ధతుల్లో అందాన్ని పెంచుకోవాలని భావిస్తోందని, ఇది సరికాదని, సహజ సిద్ధంగానే అందాన్ని ఎలా పొందగలరో వివరిస్తూ వీడియోను పోస్ట్ చేసింది. మేకప్ వేసుకోను.. తల దువ్వుకోను.. ఫిల్లర్లు అవసరం లేదు.. బొటాక్స్ తో పని లేదు! అంటూ మలైకా షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, సమయానికి నిద్ర పోవడం చాలా ముఖ్యమని సూచించింది మల్లిక.
అయితే కాంటాలాగా గర్ల్ షెఫాలి జరివాలా మరణించిన మరుసటి రోజు మల్లిక ఈ పోస్ట్ చేయడంపై నటి రాఖీ సావంత్ తీవ్రంగా విరుచుకుపడింది. షెఫాలి (42) తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు యాంటి ఏజింగ్ మందులు వాడిందని, దాని కారణంగానే గుండె నొప్పి వచ్చి మరణించిందనే వార్తలు వస్తున్న సమయంలో మల్లిక ఇలాంటి వీడియో చేయడంపై రాఖీ రుసరుసలాడింది. ప్రస్తుతం మల్లిక వర్సెస్ రాఖీ సావంత్ వ్యవహారంపై నెటిజనుల్లో చర్చ సాగుతోంది. మల్లిక టైమింగ్ సరిగా లేదు.. సోషల్ మీడియాల్లో లైక్ లు క్లిక్ ల కోసం ఇలా చేయడం బాలేదని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.
