Begin typing your search above and press return to search.

మెగా 156.. మోత మొదలైంది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ పూజా కార్యక్రమాలు దసరా సందర్భంగా ప్రారంభం అయ్యాయి

By:  Tupaki Desk   |   24 Oct 2023 8:15 AM GMT
మెగా 156.. మోత మొదలైంది
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ పూజా కార్యక్రమాలు దసరా సందర్భంగా ప్రారంభం అయ్యాయి. సినీ ప్రముఖుల మధ్య ఈ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో రాఘవేంద్రరావు, వివివినాయక్, అల్లు అరవింద్, మారుతి పాల్గొన్నారు. ఈ లాంచింగ్ కి సంబందించిన ఒక వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ వీడియోలో ముందుగా ఎంఎం కీరవాణి మాట్లాడుతూ పాత రోజుల్లో సినిమాని మ్యూజిక్ సిట్టింగ్స్ తో స్టార్ట్ చేసే వాళ్ళం. అయితే ప్రస్తుతం అలా జరగడం లేదు. మళ్ళీ చాలా కాలం తర్వాత మెగా 156 సినిమాని కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ తోనే స్టార్ట్ చేయడం జరిగిందని తెలిపారు. దర్శకుడు వశిష్ట మల్లిడికి విషెస్ చెప్పారు. సినిమాలో ఆరు పాటలు అద్భుతంగా ఉంటాయని అన్నారు.

చంద్రబోస్ మాట్లాడుతూ ఈ సినిమాలో సాంగ్స్ రాసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. యూవీ నిర్మాతలలో ఒకరైన వంశీ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. అనంతరం సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాఘవేంద్రరావు మూవీకి క్లాప్ కొత్తగా అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ స్క్రిప్ట్ ని నిర్మాతకి అందించారు.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా వంశీ, ప్రమోద్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. బింబిసారా లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వశిష్ట మల్లిడి అంతకు మించి అనే విధంగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. చోటా కె నాయుడు ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తూ ఉండటం విశేషం. భారీ వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా సెకండ్ ఇన్నింగ్ లో మొదటి సారి ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని పాత్రలో, కథతో ఈ మూవీ చేస్తూ ఉండటం విశేషం. మరి ఈ సినిమా యూవీ వారికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.