Begin typing your search above and press return to search.

మేల్ డామినేష‌న్ .. ఇలా అయితే టాలీవుడ్‌లో ఇబ్బందే!

అయితే ఇండ‌స్ట్రీపై ఏ నెగెటివ్ కామెంట్ చేసినా దాని ప్ర‌భావం కెరీర్ పై ప‌డుతుంది. ఇటీవ‌ల మీటూ ఉద్య‌మ స‌మ‌యంలో బ‌య‌ట‌ప‌డిన ఏ క‌థానాయిక లేదా న‌టీమ‌ణికి ఇప్పుడు అవ‌కాశాల్లేవ్.

By:  Tupaki Desk   |   24 Aug 2025 8:00 AM IST
మేల్ డామినేష‌న్ .. ఇలా అయితే టాలీవుడ్‌లో ఇబ్బందే!
X

అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోను మేల్ డామినేష‌న్ గురించి చ‌ర్చ సాగుతూనే ఉంటుంది. ఇది ఎప్ప‌టికీ ఎండ్ లెస్ డిబేట్. అయితే సినీరంగంలో మేల్ డామినేష‌న్ గురించి చాలా అరుదుగా మాత్ర‌మే న‌టీమ‌ణులు బ‌య‌ట‌ప‌డుతుంటారు. ఇటీవ‌ల కొన్నేళ్లుగా రంగుల ప్ర‌పంచంలో ప‌లువురు క‌థానాయిక‌లు మేల్ డామినేష‌న్ గురించి బ‌హిరంగంగా మాట్లాడుతున్నారు. వేత‌నాలు, సౌక‌ర్యాల్లో హీరోల‌తో పోలిస్తే, త‌మ‌ను త‌క్కువ‌గా చూస్తార‌ని ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలున్నాయి.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వ‌ర‌కూ ఎదురే లేని కెరీర్ ని సాగిస్తున్న ప్రియాంక చోప్రా, బాలీవుడ్ లో మేల్ డామినేష‌న్ గురించి బాహాటంగా కామెంట్లు చేసారు. హీరోల‌తో స‌మానంగా తాము శ్ర‌మిస్తున్నా కానీ, వారితో స‌మానంగా పారితోషికాలు చెల్లించ‌ర‌ని ప్రియాంక చోప్రా ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు. హిందీ చిత్ర‌సీమ‌లో మేల్ డామినేష‌న్ స్ప‌ష్ఠంగా ఉంద‌ని పేర్కొన్నారు. అంతేకాదు హీరో వ‌చ్చాకే షూటింగ్ మొద‌లు పెట్టే క‌ల్చ‌ర్ కూడా మ‌న‌కు ఉంది. కానీ హాలీవుడ్ లో ఇలాంటివేవీ లేవు. పారితోషికాల ప‌రంగాను సంతృప్తి ఉంది`` అని పీసీ వ్యాఖ్యానించారు.

అయితే ఇండ‌స్ట్రీపై ఏ నెగెటివ్ కామెంట్ చేసినా దాని ప్ర‌భావం కెరీర్ పై ప‌డుతుంది. ఇటీవ‌ల మీటూ ఉద్య‌మ స‌మ‌యంలో బ‌య‌ట‌ప‌డిన ఏ క‌థానాయిక లేదా న‌టీమ‌ణికి ఇప్పుడు అవ‌కాశాల్లేవ్. కేవ‌లం వేధింపుల గురించే కాదు, ఏ ఇత‌ర అన్యాయాన్ని ప్ర‌శ్నించినా న‌టీమ‌ణులు కార్న‌ర్ గా మార‌డం చూస్తున్న‌దే.

అయితే ప్రియాంక చోప్రా అగ్రెస్సివ్ నేచుర్‌తో సంబంధం లేకుండా రాజ‌మౌళి- మ‌హేష్ టీమ్ త‌న‌కు ప్ర‌తిభ ఆధారంగా అవ‌కాశం క‌ల్పించారు. టాలీవుడ్ లో మేల్ డామినేష‌న్ గురించి మాట్లాడే క‌థానాయిక‌కు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని ఇది నిరూపించింది. ఎస్.ఎస్.ఎం.బి 29 కోసం రాజ‌మౌళి- మ‌హేష్ బృందం కేవ‌లం అంత‌ర్జాతీయ మార్కెట్ ని మాత్ర‌మే దృష్టిలో పెట్టుకుని ప‌ని చేస్తున్నారు. ప్రియాంక చోప్రాకు గ్లోబ‌ల్ ఐక‌న్ గా ఉన్న గుర్తింపు త‌మ సినిమా మార్కెట్ కి స‌హ‌క‌రిస్తుంద‌ని భావిస్తున్నారు. ఇత‌ర సాధార‌ణ‌ అంశాల‌ను జ‌క్క‌న్న టీమ్ అంత‌గా ప‌ట్టించుకోదు. ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ గా త‌మ ప‌ని తాము చేసుకుపోవ‌డం వారి ప్ర‌త్యేక‌త అని నిరూప‌ణ అవుతోంది.