Begin typing your search above and press return to search.

ఈ మలయాళం సినిమాలు హిట్టే కానీ..

భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆడుజీవితం సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

By:  Tupaki Desk   |   16 April 2024 8:55 AM GMT
ఈ మలయాళం సినిమాలు హిట్టే కానీ..
X

మలయాళం సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా అక్కడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. 2024లో నాలుగు నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే పలు మాలీవుడ్ సినిమాలు ఓ రేంజ్ వసూళ్లు రాబట్టాయి. ఇటీవల రిలీజైన స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన మాలీవుడ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించిన ఆడుజీవితం- ది గోట్ లైఫ్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కేవలం ఎనిమిది రోజుల్లోనే కేరళలో రూ.100 కోట్లు వసూలు చేసింది. మోహన్ లాల్ లూసిఫర్ మూవీ రికార్డు బ్రేక్ చేసింది. సర్వైకల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్.. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. రూ.250 కోట్ల వైపు అడుగులేస్తోంది.

ఇక హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ప్రేమలు రూ.140 కోట్లకు పైగా వసూలు చేసింది. మమ్ముట్టి భ్రమయుగం రూ.75 కోట్లు రాబట్టగా.. టొవినో థామస్ అన్వేషిప్పన్ కొండెతుమ్ రూ.50 కోట్లు వసూలు చేసింది. ఇటీవల రిలీజైన ఆవేశం, వర్షంగల్కు శేషం సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. అలా ఇప్పటికి వరకు 2024లో మలయాళం ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద రూ.750 కోట్లకు పైగా వసూలు చేసింది.

ప్రస్తుతం మాలీవుడ్ ఇండస్ట్రీ కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. ఒకే భాషలో నాలుగు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్లు కావడం అరుదైన ఘనత అని సినీ ప్రియులు చెబుతున్నారు. మాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అక్కడి సినిమాలకు ఆదరణ దక్కుతుందని అంటున్నారు. అయితే బాలీవుడ్, టాలీవుడ్ కన్నా మాలీవుడ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతుందని కామెంట్లు పెడుతున్నారు.

అయితే మాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు తెలుగులోకి వరుసగా డబ్ అవుతున్న విషయం తెలిసిందే. భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆడుజీవితం సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే పలు సినిమాలు మలయాళంలో మంచి వసూళ్లు రాబడుతున్నా.. మిగతా భాషల్లో మాత్రం పెద్దగా వసూలు చేయడం లేదు.

ఈ రోజుల్లో కన్నడ తమిళ సినిమాలు మిగతా భాషల్లో సైతం సాలీడ్ కలెక్షన్స్ రాబడుతున్నాయి. లోకల్ కంటెంట్ ను పాన్ ఇండియా కంటెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మలయాళం సినిమాలు మాత్రం ఇంకా పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్ కావడం లేదు. ఆరంభంలో ఉన్న దూకుడు తర్వాత ఉండడం లేదు. దీంతో ఆయా భాషల మేకర్స్ కు పెద్దగా లాభాలు రావడం లేదని టాక్. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి.